ఆ బాధ నాకు తెలుసు : క్యాన్సర్ చిన్నారితో యువరాజ్

UVIక్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచిన టీమిండియా క్రికెటర్ యువరాజ్ ..మళ్లీ క్రికెట్ లో రాణిస్తూ ఎంతో మందికి దైర్యంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం IPLలో ఈ సారి పంజాబ్ లో ఆడుతున్న యువీ..శుక్రవారం (మే-11) ఓ క్యాన్సర్ బాధిత చిన్నారిని కలిశారు. క్యాన్సర్ భయంకరమైన వ్యాధి కాదని..ధైర్యంగా ఉండాలని అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు యువరాజ్. 11 ఏళ్ల రాకీ అనే ఆ బాలుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అతనితో కాసేపు ముచ్చటించిన యువీ..ఆ బాధ తనకు తెలుసు అన్నారు. ఆ తర్వాత  కింగ్స్ పంజాబ్ టీమ్ సంతకాలు చేసిన జెర్సీతోపాటు క్యాప్ అందించాడు. ఈ ఫొటోలను తమ ట్విట్టర్‌ లో షేర్ చేసింది పంజాబ్ టీమ్. దీంతో యువీని సోషల్ మీడియాలో పొగడ్తల్లో ముంచెత్తారు నెటిజన్లు.

2011 వరల్డ్‌కప్ టీమిండియా గెలవడంలో యువరాజ్‌దే కీలకపాత్ర. మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా  అతడు నిలిచాడు. ఆ వెంటనే అతని ఊపిరితిత్తుల్లో గోల్ఫ్ బాల్ సైజులో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. కీమోథెరపీ తీసుకొని క్యాన్సర్‌ ను జయించిన తర్వాత యువీ మళ్లీ క్రికెట్ ఆడుతున్నాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy