ఆ బిచ్చగాడి ఆస్తి కోటి 30 లక్షలు

BEGGER-MONEY-1ఆఫీసులకు వెళ్లే వాళ్లు కూడా జీవిత కాలంలో సంపాదించని డబ్బును బెంగుళూర్ లోని ఓ బిచ్చగాడు సంపాదించాడు. ఎంతో తెలుసా.. కోటి 30 లక్షలు. బాప్ రే అన్పిస్తుందా… సంచులు, కవర్ల నిండా కట్టలకు కట్టల డబ్బులు దాచాడు ఆ బిచ్చగాడు. అయితే అతను చనిపోయిన తర్వాత కానీ అసలు విషయం బయటపడలేదు. బిక్షమెత్తుకుని బతుకుతున్నాడు.. పాపం ముసలోడు.. తలా ఇంతేసుకుని అంత్యక్రియలు చేద్దామనుకున్న జనానికి పెద్ద షాకే ఇచ్చాడు. అతను రోజూ ఉండే గుడిసెలోకి వెళ్లి చూసేసరికి ఈ పైసల బ్యాంకు బయటపడింది. ఎంత డబ్బులు కూడబెడితే ఏంటి.. చివరికి ఇలా.. అయిపోయింది అంటున్నారు స్థానికులు. అయితే.. ఓ బిచ్చగాడికి ఇంత డబ్బు సాధ్యమా.. దీని వెనక ఏదైన మతలబు ఉండొచ్చని భావిస్తున్నారట అక్కడి వాళ్లు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy