ఆ భిక్షగాని ఇంట్లో నాలుగు సంచుల్లో డబ్బు

rehman mumbia beggarముంబైలోని కల్యాణ్ ప్రాంతంలో ఉండే అబ్దుల్ రెహ్మన్ ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయ్యింది. దేశంలో ఎక్కడో ఒక చోట ఎప్పుడూ జరిగేదే కదా అనుకుంటున్నారా… అక్కడే అసలు విషయం ఉంది. ఈ ప్రమాదంలో ఆయన ఇల్లు కాలిపోయినా… ఓ షాకింగ్ న్యూస్ బయటపడింది. ఆయన ఎప్పటి నుంచో దాచుకుంటున్న డబ్బు.. నాలుగు సంచుల్లో బయటపడింది. దీంతో ఆ చుట్టుపక్కల వారి ఆశ్చర్యానికి అంతు లేదు. ఎందకంటే.. రెహ్మన్ భిక్షగాడు కావడమే. ఈ ప్రమాదంలో డబ్బు సంచులు కొద్దిగా కాలినా.. పెద్దగా నష్టం జరగలేదు. రెహ్మన్ తో పాటు ఆయన భార్య కూడా భిక్షమెత్తుకొనే జీవనం సాగిస్తున్నారు. తన తండ్రి ఇల్లు కాలిపోయిందని చూడటానికి వచ్చిన రెహ్మన్ పెద్ద కొడుకు కూడా ఈ విషయం తెలిసి షాకయ్యాడు. అయితే నెటిజన్లు మాత్రం ఈ ఇన్సిడెంట్ పై తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. దేశంలో గ్రాడ్యుయేట్ల సంపాదన కన్నా భిక్షగాళ్ల సంపాదనే ఎక్కువని మరోసారి రుజువయ్యిందంటున్నారు నెటిజన్లు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy