ఆ మేగజైన్ లో అలాంటివి ఉండవట

hebrew-playboy_2500570bప్లేబోయ్… ఈ పేరు వింటేనే కుర్రకారు మతులు పోతాయ్. అప్సరసల్లాంటి అమ్మాయిల న్యూడ్ ఫొటోస్ తో సంచలనం సృష్టించింది ఈ మేగజైన్. శృంగార చిత్రాలకు పెట్టింది పేరైన ప్లేబోయ్ మేగజైన్ ఓ సెన్సేషనల్ డెసీషన్ తీసుకుంది. ఇకనుంచి ఈ మేగజైన్ లో మహిళల నగ్న చిత్రాలు పబ్లిష్ చేయరాదనే నిర్ణయం తీసుకుంది. రీ డిజైన్ చేసిన కొత్త మేగజైన్ ను వచ్చే మార్చిలో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

2D5A57F300000578-3270236-image-m-8_1444713922204ఎడిటర్ కోరీ జోన్స్ చేసిన ఈ ప్రతిపాదనతో ఫౌండర్ హుగ్ హెప్నర్, మిగిలిన ఎడిటోరియల్ టీమ్ అంగీకారం తెలిపింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లో పోర్న్ వీడియోస్, ఫొటోస్ కి విపరీతమైన వ్యూవర్స్ ఉండటం… దీంతో అడల్ట్ మేగజైన్లకు అంతకంతకు ఆదరణ తగ్గుతుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. 1953లో ఇదే నెలలో ఈ మేగజైన్ స్థాపించారు. అదే ఏడాది డిసెంబర్ లో తొలి సంచిక విడుదలయ్యింది. హాలివుడ్ అందాల తార మార్లిన్ మన్రో కవర్ ఫొటోతో మార్కెట్ లోకి వచ్చింది. ఆమె న్యూడ్ ఫోటోస్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. అలా అంతకంతకు పెరిగిన సర్క్యులేషన్.. 1975లో ప్లేబోయ్ సర్క్యులేషన్ 56 లక్షలకు చేరింది. గతేడాది 10 లక్షలకు పడిపోగా..  ప్రస్తుతం సర్క్యులేషన్ 8 లక్షలకు చేరిందని సంస్థ రిపోర్టులు తెలుపుతున్నాయి. ఇంతలా ఆదరణ కరువైనప్పుడు  ఇంకా ప్లేబోయ్ ను శృంగార చిత్రాల మేగజైన్ గా కొనసాగించడం అర్ధరహితమనే భావనలో సంస్థ ఉన్నట్టు సమాచారం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy