ఆ రాంగ్ కాల్… ఓ బాలుని పెళ్లికి కారణమైంది


టైం పాస్ కోసం ఓ 15 ఏళ్ల బాలుడు చేసిన రాంగ్ కాల్ అతని జీవితాన్నే మార్చేసింది. తనకంటే మూడురెట్ల వయస్సున్న మహిళతో మ్యారేజ్ చేసింది. అస్సాంలోని గోల్‌పాడా జిల్లాకు చెందిన కుర్రాడు చదువు మధ్యలోనే ఆపేసి కార్మికుడిగా మారాడు. ఓ రోజు టైమ్‌పాస్‌ కాక రాంగ్‌ కాల్‌ చేశాడు. అవతలి నుంచి మాట్లాడింది ఆడ గొంతు కావడంతో డబుల్‌ హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. రోజుకొకసారైనా మాట్లాడుకోకుండా ఉండలేని స్థితికి వచ్చారు ఇద్దరూ. నెలరోజులగా ఆమెతో ఫోన్‌ మాట్లాడటంతో నిండా ప్రేమలో మునిగిపోయాడు ఆ బాలుడు. ఆమెను కలవాలని ఆమె చెప్పిన ఆడ్రస్‌కు వెళ్లాడు. తీరా వెళ్లి చూశాక షాక్ అయ్యాడు.

ఆమె బార్‌పేట జిల్లా సుఖూవాజార్‌కు చెందిన 60 ఏళ్ల వితంతువు. నెలరోజులుగా మాట్లాడుకున్నా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఏజ్ ప్రస్తావన రాలేదు.  ఈ వ్యవహారం తెలిసిన మహిళ బంధువులు, సన్నిహితులు, స్థానికులు ఆ ఇద్దరకి బలవంతంగా మ్యారేజ్ చేశారు. తమకు ఇష్టం లేకుండా వివాహం చేశారని ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లల హక్కుల కమిషన్‌ దీనిపై విచారణకు ఆదేశించింది. అబ్బాయి మైనర్‌ అయివుంటే.. బలవంతంగా వివాహం చేసినవారిపై చట్టపరమైన శిక్షలు ఉంటాయని కమిషన్‌ తెలిపింది. ఇక ఈ గొడవపై స్పందించిన గోల్‌పాడా డిప్యూటీ కమిషనర్‌ వార్నాలి డెకా..  ఆ ఇద్దరి పెళ్లి గురించి ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని, కానీ ఎవరైన దీనిపై విచారణ కోరితే దర్యాప్తు చేసి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy