ఆ సినిమాను రీమేక్ చేయమన్న రజనీ

power-pandiఅన్నకు ఇచ్చిన మాటను తప్పని తమ్మునిగా మోహన్ బాబు పెదరాయుడు చిత్రంలో రజనీకాంత్ మాటకు కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు ఆ మాట ఎందుకు వచ్చిందంటే…హీరో ధనుష్ దర్శకత్వం చేసిన తొలి తమిళ చిత్రం ‘పవర్‌పాండి’ శుక్రవారం విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది.ఈ చిత్రం ప్రీమియర్ షోకి రజనీ తన స్నేహితుడు మోహన్ బాబును కూడా పిలిచారు. రాజ్ కిరణ్ ముఖ్య పాత్రలో 64 ఏళ్ల వృధుడి ఆశలు..ఆశయాలు ఎలా ఉంటాయి? అనే కధనంతో చిత్రీకరించాడు ధనుష్. సినిమా తనకెంతో నచ్చిందని.. ధనుష్ ఇంకొక పదేళ్లు దర్శకత్వం చేసే పని లేదని.. ఈ సినిమా ఎన్నో ఏళ్లు నిలిచిపోతుందని ప్రశంసించారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్. అయితే తెలుగులో ఈ చిత్రాన్ని మోహన్ బాబు రీమేక్ చేస్తే బాగుంటుందని తన మనసులో మాట  చెప్పాడు సూపర్‌స్టార్‌. మరి రజనీకాంత్ సూచనలను మోహన్‌బాబు పాటిస్తాడో లేదో వేచి చూడాలి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy