ఆ సినిమా తొలి ప్రేక్షకుడిని నేనే : చిరంజీవి

chiru 2తన సినిమా ప్రమోషన్ కోసం స్టార్ హీరోలందరిని వాడేస్తున్న డైరెక్టర్ సుకుమార్ ఫైనల్ గా మెగాస్టార్ ను సీన్ లోకి తీసుకువచ్చాడు. ఇప్పటికే మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ‘దర్శకుడు’ సినిమా ఫంక్షన్లలో సందడి చేయగా ఇప్పుడు మెగాస్టార్ చిరు కూడా ‘దర్శకుడు’ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చి ఫ్యాన్స్ ని సర్ ఫ్రైజ్ చేశారు. ఈ సినిమా తొలి టికెట్ ను తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేశాడు. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అశోక్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

తొలి ప్రేక్షకుడిని అయినందుకు ఆనందంగా ఉంది 

తొలి టికెట్‌ని కొన్న చిరంజీవి ‘దర్శకుడు’ సినిమా పెద్ద హిట్‌ కావాలని చిత్ర యూనిట్‌కి బెస్ట్‌ విషెష్‌ తెలియజేశారు.
‘నాకు చాలా ఆశ్యర్యంగా ఉంది. ఫస్ట్‌ టికెట్‌ని నాకు అందించి, దర్శకుడు సినిమాకి నన్ను తొలి ప్రేక్షకుడిని చేసినటువంటి ఈ ‘దర్శకుడు’ యూనిట్‌ సభ్యులకు.. సుకుమార్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. సుకుమార్‌ ఈ సినిమాని వెనక ఉండి నడిపించిన వెన్నెముక. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో గతంలో వచ్చిన ‘కుమారి 21ఎఫ్‌’ ఎంత సూపర్‌హిట్‌ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ ‘దర్శకుడు’ చిత్రం కూడా సుకుమార్‌ సమర్పణలో తెరకెక్కడం, అలాగే ఆయన సోదరులు ఈ చిత్రానికి నిర్మాతలు కావడం అభినందించాల్సిన విషయం. సుకుమార్‌లో నచ్చిన విషయం ఏమిటంటే..ఒక దర్శకుడిగా ఆయన ఉన్నత స్థానంలో ఉన్నాడు. తను కమర్షియల్‌ సినిమాలు చేసుకుంటూ, ఉన్న సమయంలో మంచి కథలను క్రియేట్‌ చేసుకుంటాడు. కేవలం నేనేమిటి అనకుండా..ఈ సినిమా ఇండస్ట్రీకి నేనేమిటి అనే కోణం నుండి ఆలోచిస్తూ..తను అప్‌కమింగ్‌ స్టోరీ రైటర్స్‌ని గానీ, అలాగే డైరెక్టర్స్‌ని గానీ, ఆర్టిస్ట్‌లని  ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌ని స్థాపించడం, అందులో ఔత్సాహికులైన కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం’. అన్నారు చిరంజీవి. దర్శకుడు హరిప్రసాద్‌ జక్కా  తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 4)న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy