ఆ 100 వంతెనలు ఎప్పుడైనా కూలిపోవచ్చు

mahrashtra-bridge-collapse-pti_650x400_61470298110దేశ వ్యాప్తంగా రహదారులపై ఉన్న 100 బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరుకున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అవి ఏ క్షణంలోనైనా కూలే ప్రమాదం ఉందని ప్రకటించారు. గురువారం(ఆగస్టు-3) ఆయన లోక్‑సభలో ఈ విషయమై మాట్లాడారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఆడిట్ లో దేశవ్యాప్తంగా ఉన్న లక్షా 60వేల బడ్జిల్లో 100 వరకు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు తేలిందన్న ఆయన.. దీనికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలోని సావిత్రి నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన గత ఏడాది కొట్లుకుపోవడంతో రెండు బస్సులు, కొన్ని ప్రైవేట్ వాహనాలు గల్లంతయ్యాయని తెలపారు గడ్కరీ. రోడ్డు ఆక్రమణలు, భూసేకరణ, పర్యావరణ అడ్డంకుల కారణంగా అనేక చోట్ల వంతెనల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 3.85 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. అవరోధాలను అధిగమించి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy