ఆ 85 గంటలు @ పఠాన్ కోట్

pathankot-air-baseతుపాకుల మోత… బుల్లెట్ల వర్షం… క్షణక్షణం ఉత్కంఠ… అన్నింటికి తెరపడింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో టెర్రర్ ఆపరేషన్ ముగిసింది. భారీగా ఆయుధాలతో బేస్ లో చొరబడిన ఆరుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. వైమానిక సంపదకు ఎలాంటి నష్టం జరగకుండా తమప్రాణాలను అడ్డుపెట్టి వీరమరణంపొందారు జవాన్లు. టెర్రరిస్టుల తూటాలకు బలైన వీర జవాన్లకు కన్నీటి వీడ్కోలు పలికారు ప్రజలు.

85 గంటలకు పైగా సాగిన ఎదురుకాల్పులు మంగళవారంతో ముగిసిపోయాయి. ఎయిర్ బేస్ లో ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ ముగిసినా.. కూంబింగ్ కంటిన్యూ చేస్తున్నాయి భద్రతా బలగాలు. రెండువేల ఎకరాలు, 27 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఎయిర్ బేస్ ను అణువణువు జల్లెడపడుతున్నాయి.

కేంద్ర రక్షణ మంత్రి పారికర్… పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఆయనతో పాటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అరుప్ రాహా, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ ఉన్నారు. లోపల ఇంకా పేలుళ్లు జరుగుతుండటంపై వివరణ ఇచ్చారాయన. టెర్రరిస్టులు తెచ్చిన గ్రనేడ్లను ఎక్కడికక్కడ పేల్చేయమని ఆదేశాలిచ్చామని.. ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్రనేడ్లను డిఫ్యూజ్ చేస్తూ ఓ అధికారి చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉగ్రదాడిలో పాక్ కు ఉన్న లింక్ పై ఇప్పుడే చెప్పలేమని.. అయితే పాక్ మేడ్ వెపన్స్ దొరికాయని హింట్ ఇచ్చారు.

పాక్ లోనే మూలాలు: NIA

ఇక అటాక్స్ పై పాక్ ను కార్నర్ చేస్తూ భారత్ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇన్ టైంలో చర్యలు తీసుకోకపోతే రెండు దేశాల మధ్య ఇక శాంతిచర్చలు ఉండవని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో ఓ నోట్ ని విడుదల చేసారు. ఉగ్రదాడికి జైష్ ఏ మహ్మద్ దే కీ రోల్ అని.. దానికి సంబంధించిన సాక్ష్యాధారాల్ని పాక్ కు పంపినట్టు తెలుస్తోంది.  అలాగే  ఉగ్రదాడి విచారణలో పాక్ సాయం కోరతామన్నారు NIA అధికారులు. టెర్రరిస్టులు ఫోన్ లో ఎవరితో మాట్లాడారో తెలియగానే పాక్ ను సంప్రదిస్తామన్నారు.

దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

అటు కేరళ పాలక్కాడ్ లో కల్నల్ నిరంజన్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకుముందు జనం సందర్శనార్థం పాలక్కాడ్ ఆర్మీ క్యాంప్ లో నిరంజన్ కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. తర్వాత వేలాదిమంది అశ్రునయనాల మధ్య నిరంజన్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేసింది కేంద్రం. మరికొంతమంది జైషే మహ్మద్ తీవ్రవాదులు ఢిల్లీలోకి చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా ఉండటంతో భారీగా బలగాలను మోహరించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy