ఆ IPS అధికారినే పెళ్లి చేసుకుంటా..

SachinAtulkarఏ అమ్మాయి అయినా… సామాన్యంగా ఏ సినీ హీరోనో ఇష్టపడుతారు. ఇది కామన్. ఒప్పుకుంటే పెళ్లికి కూడా సిద్ధమంటారు. అయితే ఓ యువతి మాత్రం పోలీసు అధికారిపై మనసు పారేసుకుంది. అంతే కాదు ఆయన్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెబుతోంది. ఆ ఆఫీసర్ ను కలవడానికి గతమూడు రోజులుగా తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేస్తోంది.

పంజాబ్‌లోని హోసియాపూర్‌కు చెందిన 27 ఏళ్ల యువతి మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చేరుకుంది. ఈ యువతి సైకాలజీలో పీజీ చేసింది. ఉజ్జయినిలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ సచిన్ అతుల్కర్(34)ను కలవాలని ఆ యువతి.. ఆయన కార్యాలయం ముందు పడిగాపులు కాస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మహిళా పోలీసు స్టేషన్ ఇంచార్జి రేఖా వర్మ.. యువతిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడింది.

సోషల్ మీడియాలో ఐపీఎస్ సచిన్ ఫోటోలు చూసిన తర్వాత ఆయనపై అభిమానం పెరిగిందని.. ఆయనపై ఇష్టం కలిగిందని పోలీసులకు చెప్పింది ఆ యువతి. సచిన్‌ను తక్షణమే కలవాలని పోలీసులకు స్పష్టం చేసింది. యువతి డిమాండ్‌కు ఏం చేయాలో తెలియక పోలీసులు చివరకు ఆమె తల్లిదండ్రులను ఉజ్జయినికి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ ఆ యువతి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇక చేసేదిమి లేక పంజాబ్‌కు పంపించేందుకు నగ్డా రైల్వేస్టేషన్‌కు ఆమెను పోలీసులు తీసుకెళ్లారు. తనను రైలు ఎక్కిస్తే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో మళ్లీ వెనక్కి తీసుకువచ్చారు ఆమెను. ఆ యువతి అడిగిన ఆహారాన్ని తీసుకువస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై సచిన్ అతుల్కర్‌ను మీడియా సంప్రదించగా.. ప్రభుత్వ అధికారిగా ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమన్నారు. వ్యక్తిగత విషయాల్లో మాత్రం తన ఇష్టాఇష్టాలకు వ్యతిరేకంగా నడుచుకోబోనని స్పష్టం చేశారు. బ్రహ్మచారిగా ఉన్న ఈ ఐపీఎస్ ఆఫీసర్.. ప్రతీ రోజు 70 నిమిషాల పాటు జిమ్ చేస్తాడు. ఫిట్‌నెస్ కాంపిటీషన్‌లో సచిన్ అతుల్కర్ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy