ఇంగ్లండ్, బంగ్లాదేశ్ టూర్లకు టీమ్స్ ఎంపిక..

suresh-raina-gautam-gambhirఐపీఎల్ 7 తర్వాత ఇంగ్లండ్, బంగ్లాదేశ్ టూర్ లకు ఇండియా టీమ్స్ ను ప్రకటించింది బీసీసీఐ. రైనా కెప్టెన్సీలో బంగ్లాదేశ్ టూర్ కు టీమ్ ను ప్రకటించింది. మూడు వన్డేల టూర్ కు ధోనీ, కోహ్లీలకు రెస్టిచ్చారు. ఇండియా టీం :  రైనా (కెప్టెన్), ఉతప్ప, రహానే, పుజారా, అంబటి రాయుడు, మనోజ్ తివారీ, జాదవ్, వృద్ధిమాన్ సాహా, రసూల్, అక్షర్, వినయ్ కుమార్, ఉమేష్ యాదవ్, బిన్నీ, మోహిత్ శర్మ, అమిత్ మిష్రా.

ఇంగ్లండ్ టూర్ కు టీమ్ :

ఇక ఇంగ్లండ్ తో జరగనున్న టెస్టులకు 18 మందితో జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టులో గౌతమ్ గంభీర్ తిరిగి స్థానాన్ని సంపాదించుకున్నాడు. జహీర్ కు రెస్టిచ్చారు. బంగ్లా టూర్ కు సెలక్టైన స్టువర్ట్ బిన్నీ, వృద్ధిమాన్ సాహాలు టెస్టులకు కూడా సెలక్టయ్యారు. టీమ్ : ధోనీ(కెప్టెన్), మురళీ విజయ్, ధవన్, గంభీర్, పుజారా, విరాట్, రహానే, రోహిత్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమి, ఈశ్వర్, ఇషాంత్, బిన్నీ, ఆరోన్, సాహా, పంకజ్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy