బ్యాటింగ్ లో ‘ఇండియన్ బౌలర్ల’ రికార్డ్…!

hi-res-7f45ef4506e4fa340e40acf76c899354_crop_northఇండియన్ బౌలర్లు ఇంగ్లండ్ లో రికార్డ్ క్రియేట్ చేశారు. అదేంటి బౌలింగ్ చేయకుండా ఏం రికార్డ్ అనుకుంటున్నారా. బౌలింగ్ లో కాదండీ..బ్యాటింగ్ లో. టెన్త్ వికెట్ కు రికార్డ్ పార్టనర్ షిప్ ను క్రియేట్ చేశారు మన బౌలర్లు. మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఇద్దరూ కలిసి దాదాపు 40 ఓవర్లు గ్రీజులో నిలిచారు. 111 పరుగులు సాధించారు. ఇద్దరు చెరో హాఫ్ సెంచరీ చేశారు. వికెట్లు పడకుండా ఇండియా టీం భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఎవరూ ఉహించని విధంగా బ్యాటింగ్ చేశారు.  టీం స్కోరు 346 దగ్గర 9 వికెట్లు పడ్డాక అంతా మరో 20 పరుగులు చేస్తే టీం ఆలౌట్ అవుతోందనుకున్నారు. కానీ ఇద్దరు గ్రీజులో నిలకడగా కుదురుకోని తమదైన షాట్ లతో అలరించారు. వారి పార్టనర్ షిప్ ను బ్రేక్ చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లకు చెమటలు పట్టాయి. ఇద్దరు కలిసి 111 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. టెన్త్ వికెట్ పార్టనర్ షిప్ లలో ఇండియాకు ఇది రెండో బెస్ట్ భాగస్వామ్యం. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ షమీ, భువనేశ్వర్లు రాణిస్తే ఫస్ట్ టెస్ట్ లో లీడింగ్ సాధించాలని టీమిండియా భావిస్తోంది. మొత్తానికి ఫారిన్ టూర్ లో పర్వాలేదనిపిస్తున్నారు ఇండియన్ ప్లేయర్లు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy