44 ఓవర్లలో 350 కొట్టేసిన ఇంగ్లండ్

rootmorganరికార్డు ఛేజింగ్ తో  ఇంగ్లండ్ టీమ్ విక్టరీ సాధించింది. కివీస్ తో నువ్వా-నేనా అన్నట్టుగా జరిగిన పోరులో పైచేయి సాధించి సిరీస్ సమం చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని 6 ఓవర్లు మిగిలివుండానే ఛేదించింది. ఇంగ్లండ్ 44 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన ఇన్నింగ్స్ కు రూట్ సెంచరీ తోడవడంతో ఇంగ్లీషు టీమ్ భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. మోర్గాన్ 82 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 113 రన్స్ చేశాడు. రూట్ 97 బంతుల్లో 13 ఫోర్లతో 106 పరుగులు సాధించాడు. హేల్స్(67) అర్ధసెంచరీ చేశాడు. రాయ్ 38, స్టోక్స్ 19 పరుగులు చేశారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy