ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థి సూసైడ్

student-sri-induరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం షేర్ గూడ లోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాల మూడవ అంతస్తు నుండి దూకి నాగ చైతన్య అనే థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం పై నుండి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఎల్ బి నగర్ లోని కామినేని హాస్పటల్కి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ రోజు అతని తండ్రి పరీక్ష ఫీజు కట్టడానికి కళాశాలకు వెళ్లగా కొన్ని సబ్జెట్లు బాక్ లాగ్స్ ఉన్నట్లు కళాశాలలోని HOD తెలిపాడు. కాలేజీలో HOD తో పాటు.. చైతన్య తండ్రి కూడా మందలించడంతో మనస్థాపానికి గురైన చైతన్య ఆత్మహత్యాయత్నానికి  పాల్పడ్డాడు. క్షణాల్లో నాగ చైతన్య బయటకు వచ్చి బిల్డింగ్ పై నుండి కిందకు దుకడంతో కాళ్లు చేతులు, విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.. అతన్ని కళాశాల నుండి ఆస్పత్రి కి తరలించడంలో నిర్లక్ష్యం వ్యవహరించారని తండ్రి వాపోయాడు. అసలు అన్ని సబ్జెక్టులు బ్యాక్ లాగ్స్ ఉన్నట్లు తమకు కళాశాల నుండి ఎటువంటి సమాచారం అందించలేదని చెప్పాడు. కనీసం మాకు ఒక హెచ్చరిక అందించినా తమ కొడుక్కి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. కళాశాల నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు చనిపోయాడని ఆరోపించారు. కామినేని ఆస్పత్రిలో స్నేహితుడు మృతి చెందాడని తెలియడం తో తోటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy