ఇంజినీరింగ్ లో భారీగా సీట్ల కోత.. త్వరలో మరిన్ని

engineeringsరాష్ట్రంలోని  కాలేజీల్లో సీట్లకు భారీగా కోతపడింది.  గతేడాదితో పోల్చుకుంటే 38వేల సీట్లను తగ్గించింది ఏఐసీటీఈ(అఖిల భారత సాంకేతిక విద్యా మండలి). ఒక్క ఇంజినీరింగ్ లోనే 14 వేల సీట్లకు కోత విధించింది. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరం 33 కాలేజీలకు అనుమతులు తగ్గగా, వాటిల్లోని 14 వేల సీట్లకు కోత ఏఐసీటీఈ పెట్టింది. రాష్ట్రంలో ఈసారి ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది రాష్ట్రంలోని 275 కాలేజీల్లో 1,38,168 సీట్లకు అనుమతినిచ్చిన ఏఐసీటీఈ.. ఈసారి 242 కాలేజీల్లోని 1,24,239 సీట్లకు మాత్రమే అనుమతిచ్చింది.  2017–18 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్య కాలేజీలకు ఏఐసీటీఈ తాజాగా అనుమతులు జారీ చేసింది. గతేడాదితో పోల్చితే బీ ఫార్మసీలో 2 వేలు, ఎంబీఏలో 5 వేలు, ఎంసీఏలో 1,500కు పైగా సీట్లకు కోత పడింది. ఎంటెక్‌లోనూ 7 వేల సీట్లకు అనుమతులి లభించలేదు. ఎంఫార్మసీలో వేయి, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 5 వేల సీట్లకు కోత పడింది. మొత్తం 38వేల సీట్లు కోత విధించారు.

మరోవైపు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో జవహార్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం తనిఖీలు పూర్తి చేసింది. ప్రస్తుతం తనిఖీ నివేదికల పరిశీలన జరుపుతోంది. వాటిలో లోపాలున్న కాలేజీలకు అనుమతులిచ్చే అవకాశం లేదు. దీనికితోడు సీట్లు, బ్రాంచీల తగ్గింపునకు 81 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మరో 11 కాలేజీలు పలు కోర్సులు, ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను నిలిపేసేందకు (క్లోజర్‌) దరఖాస్తు చేసుకున్నాయి. ఆ ప్రకారం మరో 20 వేల సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy