ఇంటర్నెట్ పయోనీర్ రాబర్ట్ టేలర్ ఇకలేరు

robert-taylerఇంటర్నెట్ పయోనీర్ రాబర్ట్ డబ్ల్యూ టేలర్ కన్నుమూశారు. 85 ఏళ్ల రాబర్ట్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం ఆయన చనిపోయినట్టు ప్రకటించారు ఆయన కుమారుడు కర్ట్ టేలర్. సాంకేతిక ప్రగతిని మరో మెట్టుపైకి తీసుకెళ్లిన ఇంటర్నెట్ కు ఆద్యుడు టేలర్. తాను పరిశోధనలు చేయడమే కాక.. కంప్యూటర్ సైన్స్ లో ప్రయోగాలు చేసే ఎంతోమందికి ఆర్థిక సాయం అందించారు. ప్రపంచగతినే మార్చేసిన కంప్యూటర్ సైన్స్, నెట్ వర్కింగ్ లలో ఆయన సేవలు నిరుపమానవైనవని చెబుతారు. ఇంటర్నెట్ మూలపురుషుడిగా కంప్యూటర్ ప్రపంచపు ప్రశంసలు అందుకున్నారు టేలర్. విండోస్‌, యాపిల్‌ సంస్థలు కూడా రాబర్ట్‌ ఆవిష్కరణల ఆధారంగానే సాఫ్‌వేర్‌లు, పీసీలను అభివృద్ధి చేశాయి. తొలినాళ్లలోని సెర్చింజెన్‌ ఆల్టావిస్టాను కూడా రాబర్ట్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం 1995లో అభివృద్ధి చేసిది. తర్వాత 2003లో దీన్ని యాహూ కొనుగోలు చేయగా… 2013లో ఇది మూతబడింది. నాసాలో కూడా పని చేశారు. జెరాక్స్ సంస్థలో కూడా పని చేశారు. పర్సనల్ కంప్యూటర్, ఎథర్నెట్, కంప్యూటర్ డిస్ ప్లేని అభివృద్ధి చేసిన ఘనత టేలర్ సొంతం. పెంటగాన్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీలో పని చేసిన ఆయన దాన్ని ఇంటర్నెట్ గా డెవలప్ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy