ఇంటి బాట పట్టిన మరో ఆర్చర్ లక్ష్మీరాణి

LAKSHIMIఒలింపిక్స్‌లో మరో ఇండియన్ ఇంటి దారి పట్టారు. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగం లో  భారత్ కు చెందిన లక్ష్మీరాణి మాఝి స్లొవేకియా చెందిన ఆర్చర్ లంగోవా అలెగ్జాండ్రా చేతిలో 1-7 తేడాతో పరాజయం పాలైంది. మొదటి రెండు సెట్లు చేజార్చుకున్న ఆమె 0-4తో వెనకబడింది. కీలకమైన మూడో సెట్లో ప్రత్యర్థులిద్దరూ సమానంగా స్కోరు చేయడంతో చెరో పాయింటు పంచుకున్నారు. నాలుగో సెట్లో ప్రత్యర్థి 27 స్కోరు చేయగా లక్ష్మి కేవలం 24 మాత్రమే చేయడంతో ఓటమి ఖరారైంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy