ఇండియన్స్ ఆలోచన ఇలా : చికెన్, మటన్ తింటూనే శాఖాహారులు అంట

veg-nonఇటీవల శాకాహారంపై గౌరవం పెరగడంతో తాము కూడా ఒకరకమైన శాకాహారులమేనంటూ చెప్పుకొంటున్నారు ఇండియన్స్. ఓ పక్క చికెన్, మటన్ లాగించేస్తూనే శాఖాహారులుగా కొందరు ఇండియన్స్ చెప్పుకుంటున్నారని ఓ సర్వే తెలిపింది. వివిధ సందర్భాల్లో మాంసాహారం తీసుకుంటున్నా అది లెక్కలోకి రాదని సమర్ధించుకుంటారంట. గురు, శనివారాలు నాన్ వెజ్ ముట్టం అంటూనే.. మిగతా రోజుల్లో లాగించేస్తుంటారని చెబుతున్నారు. ఇలాంటి వారిని ఎనిమిది కేటగిరీలు విభజించి.. వారికి వివిధ రకాలు పేర్లు పెట్టారు.

… పూర్తి శాఖాహారులు (ఏ రూపంలోనూ మాంసాన్ని తీసుకోకపోవడం అంటే వీరు కేవలం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజలు, కందలు తింటారు.)

… వీరు కోడి గుడ్డు తింటారు. కానీ చికెన్, మటన్, ఇతర మాంసాహారం తినరు. ( ఎగ్‌టేరియన్లు )

… కోడిగుడ్డుతో చేసిన కేక్ లు, ఇతర ఆహార పదార్ధాలు తీసుకుంటారు. కానీ బాయిల్డ్ ఎగ్, ఆమ్లేట్ తినరు (వీరు  కేకిటేరియన్లు )

… చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తారు. అందులోని ముక్కలు తినరు. చికెన్, మటన్ కర్రీలోని గ్రేవీ తింటారు.. ముక్కల జోలికి వెళ్లరు. ( వీరు గ్రేవిటేరియన్లు)

… చికెట్, మటన్ లాగించేస్తారు. కాకపోతే బయట మాత్రమే. ఇంట్లో మాత్రం అస్సలు తినరు.(వీరు రిస్ట్రిక్టేరియన్లు)

… లిక్కర్ పార్టీలు, మందు కొట్టినప్పుడు మాత్రమే వీళ్లు మాంసం తీసుకుంటారు. మిగతా టైంలో శాఖాహారులు ( వీరు బూజిటేరియన్లు )

… ఈ కేటగిరీ చాలా డేంజర్. తినాలనే కోరిక ఉంటుంది. ఎవరైన ఫోర్స్ చేస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారు. మిత్రులు లేదా బంధువులు బలవంతం చేస్తే చికెన్, మాంసం తింటారు ( వీరు ఫోర్సిటేరియన్లు )

… వీరొక అవకాశవాదులు. గురు, శని లాంటి కొన్ని రోజుల్లో మాంసం ముట్టరు. మిగిలిన వారాల్లో ఫుల్ గా తినేస్తారు ( వీరు క్యాలెండర్టేరియన్లు )

భారతదేశంలో మాంసం తినేవారిని ఎనిమిది కేటగిరీలుగా విభజించారు. అందరూ ఏదో ఒక సందర్భంలో తింటూనే శాఖాహారులుగా చెప్పుకోవటానికి ఇష్టపడతారని అంటున్నారు పరిశోధకులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy