ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు

Indian-Coast-Guardఇండియన్ కోస్ట్ గార్డు లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా యాంత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన ఎలక్ట్రికల్, మెకానికల్,ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిప్లొమా ఫురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

పోస్టు పేరు: యాంత్రిక్ టెక్నికల్ (డిప్లొమా ఇంజినీరింగ్)

అర్హతలు: ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) నుంచి కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్లడిప్లొమా ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్)లో ఉత్తీర్ణత. జాతీయస్థాయి క్రీడల్లోని 1, 2 ,3వ స్థానం చాంపియన్‌షిప్ పొందిన అభ్యర్థులకు అర్హత మార్కుల్లో ఐదుశాతం సడలింపు ఉంటుంది.

ఏజ్ లిమిట్ : కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్టంగా 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1996, ఆగస్టు 1 నుంచి 2000, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. SC,STలకు ఐదేళ్లు…OBC లకు  మూడేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు:

ఎత్తు: 157 సెం.మీ. ఉండాలి.

ఛాతీ: శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి.

బరువు: ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.

కంటిచూపు:  6/24, 6/9, 6/12

ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్షకు ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్ రాతపరీక్షను 2018 మార్చిలో నిర్వహిస్తారు.

రాతపరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో సంబంధిత డిప్లొమా ఇంజినీరింగ్ సబ్జెక్టులైన ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌పై కూడా ప్రశ్నలు వస్తాయి. రాతపరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్‌లను నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు 1- 2 రోజులు పడుతుంది.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో..

7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి. 20 ఉతక్ బైటక్‌లు, 10 ఫుష్ అప్‌లు చేయాలి
పై అన్ని పరీక్షల్లో క్వాలిఫై అయినవారికి వైద్యపరీక్షలను నిర్వహించి, తుది ఫలితాలను ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెబ్‌సైట్‌లో 2018 జూలైలో ప్రకటిస్తారు.

జీతభత్యాలు: రూ. 29,200 + యాంత్రిక్ పే రూ. 6,200/- వీటికి తోడు (7వ వేతన పే స్కేల్ అనుసరించి) డీఏ, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.

ప్రమోషన్లు: యాంత్రిక్ టెక్నికల్ నుంచి ప్రధాన్ సహాయక్ నుంచి ఇంజినీర్ హోదా వరకు వెళ్లవచ్చు. ప్రధాన అధికారి పేస్కేల్ రూ. 47,600 + యాంత్రిక్ పే రూ.6,200/- వీటికి తోడు (7వ వేతన పే స్కేల్ అనుసరించి) డీఏ, కిట్ మెయింటెనెన్స్, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి. ఉచితంగా రేషన్, దుస్తులు, వైద్యం అందిస్తారు. (కుటుంబ సభ్యులకు కూడా). అంతేకాదు నామమాత్రపు లైసెన్స్ ఫీజుతో వసతి సౌకర్యం కల్పిస్తారు. రూ. 25 లక్షలకు ఇన్సూరెన్స్ ఉంటుంది. క్యాంటీన్, పలు రకాల రుణసదుపాయాలను అందిస్తారు. వీటితో పాటు పదవీ విరమణ సహాయక పెన్షన్ స్కీమ్ అండ్ గ్రాట్యుటీ తో పాటు రిటైర్ అయిన తర్వాత ఈసీహెచ్‌ఎస్ మెడికల్ సౌకర్యం ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఏదైనా ఒక పరీక్ష కేంద్రాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

సెంటర్లు: ముంబై, కోల్‌కతా, చెన్నై, నోయిడా.

 ట్రైనింగ్ : ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో 2018 ఆగస్టు నుంచి ట్రెయినింగ్ ప్రారంభమవుతుంది. టెక్నికల్ సంబంధించి సముద్ర శిక్షణ, వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్. అర్హత కలిగిన అభ్యర్థులు వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. పరీక్షతేదీ, సమయం, ప్రదేశం తదితర విషలయాలన్నింటిని ఈ-మెయిల్ ఐడీ ద్వారానే తెలియజేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

దరఖాస్తుకు కేవలం 8 రోజులు మాత్రమే సమయం ఉంటుంది.

దరఖాస్తులకు చివరితేదీ: 2018 జనవరి 19

రాతపరీక్ష: 2018 మార్చిలో

వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy