ఇండియన్ క్రికెట్ కు ఫిక్సింగ్ జాడ్యం

rcb-15573131ఇప్పటిదాకా అనుమానాలే. ఇక అవన్నీ నిజాలే. నిజం నిలకడ మీద తేలుతుంది…. సామెత ఓల్డ్ అయినా క్లారిటీ ఎవర్ గ్రీన్. ఇప్పుడదే జరిగింది. నిజం నిగ్గు తేలింది. అన్నింటిపై స్పష్టత వచ్చింది. ఇన్నాళ్లు ఏమీలేదన్నారు. ఇప్పుడు ఏదో ఉందంటున్నారు. ఇండియన్ క్రికెట్ ను ఫిక్సింగ్ బూతం కుదిపేస్తోంది. టీమిండియాలో ఫిక్సర్లున్నారని వార్తలు వచ్చినా.. వాటినెవరూ పట్టించుకోలేదు. అయితే స్పాట్ ఫిక్సింగ్. ఐపీఎల్, ఫిక్సింగ్, బెట్టింగ్ లపై విచారణ జరిపిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సర్వం వెల్లడైంది. ఆరుగురు భారత ఆటగాళ్లు ఫిక్సర్లని… వీరిలో ఒకరు ప్రస్తుతం టీంలో ఉన్నారని… అతను వరల్డ్ కప్ లో కూడా ఆడాడని ముద్గల్ కమిటీ తేల్చింది. అయితే వరల్డ్ కప్ లో ఆడి… ప్రస్తుతం టీంలో ఉన్నది ధోనీ, కోహ్లీ, రైనా, అశ్విన్. మరి వీరిలో ఫిక్సర్ ఎవరనేది వెల్లడి కాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ కు పాల్పడ్డాడు. బుకీలతో సంబంధం ఉన్న బాలీవుడ్ నటుడు విందూ సింగ్ కు మెయ్యప్పన్ సమాచారాన్ని అందిచేవాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్స్ రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలపై కూడా బెట్టింగ్ ఆరోపణలున్నాయి. అయితే మెయ్యప్పన్, కుంద్రాలు బెట్టింగ్ చేశారా అనే దానిపై మరింత విచారణ జరపాలని ముద్గల్ కమిటీ అభిప్రాయపడింది.IPL ఆరో ఎడిషన్ లో 2013 మే 12న చెన్నై- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ పై అనుమానం ఉందని నివేదికలో తెలిపారు.

ఫిక్సింగ్ కు హవాలా సొమ్ము వస్తోంది. ఫిక్సింగ్ లో దావూద్ ఇబ్రహీం పాత్రపై ఆరోపణలు వచ్చినా ముంబై పోలీసులు దర్యాప్తు చేయలేదు. పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్ కు సంబంధముందని తేలినా అతన్ని దేశం విడిచి వెళ్లనిచ్చారు. ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ పైన 150 కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని వార్తలున్నాయి. ప్రధానంగా చోటా షకీల్, దావూద్ లు బెట్టింగ్ ను నడిపించినట్టు విచారణలో తేలింది.

ఐపీఎల్ మ్యాచ్ లు ఫిక్స్ అయ్యాయని ఇద్దరు బీసీసీఐ మాజీ అధ్యక్షులు ముద్గల్ కమిటీకి చెప్పారు. మాజీ అధ్యక్షులు A.C ముత్తయ్య, బింద్రా, దాల్మియా, శశాంక్ మనోహర్ లు కమిటీ ముందు హాజరయ్యారు. అయితే వీరిలో ఆ ఇద్దరు ఎవరనేది నివేదికలో వెల్లడించలేదు.

ఫిక్సింగ్ ను అరికట్టేందుకు ముద్గల్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. బెట్టింగ్ ను చట్టబద్దం చేయడం, ఫిక్సింగ్ ను నివారించేందుకు ప్రత్యెక పరిశోధనా విభాగాలను ఏర్పాటు చేయాలి. మ్యాచ్ ల తర్వాత జరిగే పార్టీలు రద్దు చేయాలి. ప్లేయర్ల బ్యాంక్ అకౌంట్స్, ఏజెంట్లు, మేనేజర్ల వివరాలన్నీ బీసీసీఐ వద్ద ఉండాలి. ఆటగాళ్లతో మాట్లాడేవారిపై, ఫోన్ కాల్స్ పై పూర్తి నిఘా ఉంచాలని ముద్గల్ కమిటీ సూచించింది.

మరోవైపు ఈ నివేదికతో సంబంధం లేకుండా ఈ నెల 12, 13 తేదీల్లో ఐపీఎల్ వేలం నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ముద్గల్ కమిటీ నివేదికను మార్చి 7 న సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy