ఇండియన్ టూరిజానికి బూస్ట్ ఇవ్వనున్న ‘ఈ-వీసా’

Visa_generic_650ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎలెక్ట్రానిక్ వీసా అందుబాటులోకి వచ్చింది. మొత్తం 43 దేశాల నుంచి వచ్చే వాళ్లకు  ఈ వీసా సదుపాయాన్ని కల్పించింది కేంద్ర  ప్రభుత్వం. హోంమినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తో పాటు టూరిజం మినిస్టర్ మహేష్ శర్మ ‘ఈ-వీసా’ను ఈ రోజు స్టార్ట్ చేశారు.

ఫారిన్ టూరిస్టులను అట్రాక్ట్  చేయడమే టార్గెట్ గా ‘ఈ-వీసా’ను స్టార్ట్ చేసింది కేంద్రం. టూరిస్టులు ఎవరైనా ఇండియాకు రావాలంటే, అంత  ఈజీ కాదు. ముందుగా  వీసా దొరకాలి. వీసా రావాలంటే…..అబ్బో ….అదో  పెద్ద తతంగం.  ఎన్నో రూల్స్,  ఎన్నో ఫామ్స్ నింపాల్సి ఉంటుంది. అన్ని ఫార్మాలిటీలు కంప్లీట్ అయితే అప్పుడు వీసా ఇస్తారు. వీసాలు ఇష్యూ చేయడంలో జాప్యానికి చెక్ పెట్టాలని, ‘ఈ-వీసా’ను స్టార్ట్ చేసింది. కేవలం ఆన్ లైన్ లో ….అప్లయ్  చేసుకుంటేనే వీసా పొందొచ్చు. అప్లికేషన్ అందగానే,  అవసరమైన  ఇన్ ఫర్మేషన్ ను ఒకసారి చెక్ చేసుకుంటారు. అంతా  ఓకే అయితే…..ఎలెక్ట్రానిక్  వీసాను ఇష్యూ  చేస్తారు.  ఒక్క మాటలో  చెప్పాలంటే…..చాలా సింపుల్ గా  వీసాలు ఇచ్చేయడన్న మాట. ‘ఈ-వీసా’తో ఇండియాలోకి వచ్చాక నెల రోజుల పాటు తిరగొచ్చు.

ఈ-వీసాలు తీసుకున్న వారు ఇండియాలోని ఢిల్లీ, ముంబై,  చెన్నై,  కోల్ కతా,  హైదరాబాద్,  బెంగళూరు, కోచి,  తిరువనంతపురం,  గోవాల్లోని ఎయిర్ పోర్టుల్లో మాత్రమే వీసాలను చెక్ చేయించుకోవాలి. ‘ఈ-వీసా’లను ఫస్ట్ ఫేజ్ లో  రష్యా,  బ్రెజిల్,  థాయ్ లాండ్, యునైటెడ్  అరబ్  ఎమిరేట్స్,  ఉక్రెయిన్,  జోర్డాన్,  నార్వే , మారిషస్ తో పాటు మరికొన్ని దేశాలకు మాత్రమే కల్పించారు. త్వరలోనే మరికొన్ని దేశాలకు ఎలెక్ట్రానిక్  వీసా ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకువస్తారు. ఎలెక్ట్రానిక్  వీసా  సిస్టమ్ ను  తీసుకురావడానికి  ముందు….కేంద్ర ప్రభుత్వం  పెద్ద ఎత్తున  కసరత్తు చేసింది.

ఇండియాలోని  టూరిస్టు ఏరియాల ఇంపార్టెన్స్ ను  తెలియచేస్తూ…..అనేక దేశాల్లో   రోడ్ షోలు  నిర్వహించింది. ఎలెక్ట్రానిక్  వీసాలు అందుబాటులోకి రావడం  వల్ల….టూరిజం ఇండస్ట్రీ ….బాగా డెవలప్  అయ్యే చాన్సెస్  ఉన్నాయి.  ఏడాదికి  దాదాపు పన్నెండు  లక్షల మంది  కొత్త  ఫారిన్ టూరిస్టులు  వస్తారని  లెక్కలు వేసుకుంది  టూరిజం మినిస్ట్రీ.  ఈ లెక్కలే  నిజమైతే…..మనదేశానికి  వద్దంటే…..ఫారిన్  డబ్బే….డబ్బు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy