ఇండియన్ హాకింగ్.. బాల మేధావికి హ్యాట్సాఫ్

tuhin (3)కాళ్లు, చేతులు పని చేయవు. వీల్ చెయిర్ కే పరిమితమయ్యాడు. తలే అతని బలం. నోటితో రాస్తాడు. తన గెడ్డంతోనే మొబైల్స్, ల్యాప్ టాప్స్ మొదలైన గాడ్జెట్స్ ను ఆపరేట్ చేస్తుంటాడు. సైన్స్ అంటే పిచ్చ ప్రాణం. అంతర్జాతీయంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అతనే ఇండియన్ స్టీఫెన్ హాకింగ్ తుహిన్. ఆర్థోరోగ్రైపోసిస్ మల్టిప్లెక్స్ కాన్ గెనిటా (arthrogryposis multiplex congenital) అనే అరుదైన వ్యాధి కారణంగా ఇలా అయ్యాడు. ఈ వ్యాధి సోకిన వారికి తల్లి గర్భంలో ఉండగా.. కాళ్లు, చేతుల మధ్య చైతన్యం లేకుండా పోతుంది. ప్రస్తుతం తుహిన్ వయస్సు 17 ఏళ్లు. పశ్చిమ్ బంగాలోని వెస్ట్ మిడ్నాపూర్ ఇతని సొంతూరు. ఐఐటీ ఖరగ్ పూర్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయ్ లో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తుహిన్ కు పుట్టినప్పటి నుంచి 20 సర్జరీలు జరిగాయి. అయినా లాభం లేకుండా పోయింది. హాకింగ్ లాగే.. వీల్ చెయిర్ కే పరిమితమైపోయాడు. అతని శరీరంలో 90శాతం పని చేయడంలేదు.

చిన్ననాటి నుంచి క్రియేటీవ్ ఫీల్డ్ లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. 2012, 2013లలో బెస్ట్ క్రియేటీవ్ చైల్డ్ అవార్డులు అందుకున్నాడు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నాడు తుహిన్. కాస్మోలజీ, కంప్యూటర్ సైన్స్ అంటే ప్రాణం. బిడ్డ వైకల్యాన్ని తలుచుకుంటూ బాధపడకుండా… తుహిన్ కు అన్ని విధాల సహకరిస్తూ.. అతనే లోకంగా బతుకుతున్నారు తల్లిదండ్రులు సుజాత, సమిరన్.

తుహిన్, స్టీఫెన్ హకింగ్… ఇద్దరి వ్యాధులు వేరైనా… ఇద్దరికీ దేవుడిచ్చిన వరం… మెదడుపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం. వారిద్దరి బ్రెయిన్లు.. అద్భుతంగా పనిచేస్తున్నాయంటున్నారు డాక్టర్లు. తుహిన్ లోని టాలెంట్ ను చూసి పలు సంస్థలు ఆర్థిక సాయానికి ముందుకొస్తున్నాయి. ఒక సంస్థ ల్యాప్ టాప్ ఇస్తే… మరో సంస్థ ..అతని చదువులకు అయ్యే ఖర్చు భరిస్తోంది. ఇలా అతన్ని అన్ని విధాల ప్రోత్సహిస్తూ.. అతని కలల సాకారానికి అండగా నిలుస్తున్నారు మనసున్న మారాజులు.

తుహిన్ ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాసి.. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఐఐటీలో జాయిన్ అవ్వాలన్నది అతని లక్ష్యం. ఈ బాల మేధావికి ఆల్ ది బెస్ట్ చెప్పండి మరి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy