ఇండియాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయవద్దు: షరీఫ్

navazభారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు.. కామెంట్లు చేయవద్దని తన మంత్రి వర్గానికి పాక్  ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించారు.  ఈ విషయాన్ని ప్రధాని సన్నిహితుడొకరు మీడియాకు తెలిపారు. భారత్-పాక్ దేశాల మధ్య శాంతి సంబంధాలు నెలకొల్పడానికి అగ్రనేతలు ప్రయత్నిస్తున్న ఈ టైంలో ఎటువంటి కామెంట్స్ చేయవద్దని… జాగ్రత్తగా వ్యవహరించాలని షరీఫ్  సూచించారు. భారత్ –పాక్ ల మధ్య శాంతి ఒప్పందాలపై ముందడుగు వేస్తామని షరీఫ్ ధీమాగా ఉన్నారు. రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించి, సంబంధాలు పెంపొందేలా వ్యవహరించాలని… సలహాలు ఇవ్వాలని మంత్రులకు, సన్నిహితులను నవాజ్ షరీప్ కోరినట్లు సమాచారం.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy