ఇండియాలో ‘ఈఫిల్ టవర్’ కన్నా పెద్ద బ్రిడ్జి…

article-2278866-1795FBF9000005DC-146_634x361_popupదేశానికి మరో అరుదైన గౌరవం దక్కనుంది. ప్రపంచంలో అతి పెద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఇండియాలో జరగనుంది. ఈఫిల్ టవర్ కన్నా పెద్ద బ్రిడ్జి కట్టనున్నారు ఇండియన్ ఇంజనీర్లు. ఈ బ్రిడ్జి నిర్మాణం 2016 కల్లా పూర్తి కానుంది. పారిస్ లో ఉన్న ఈఫిల్ కన్నా 35 మీటర్ల ఎత్తులో కొత్త బ్రిడ్జి ఉండనుంది. ఈ బ్రిడ్జ్ ను చెనాబ్ నదీపై కట్టనున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ కొత్త బ్రిడ్జి కన్ స్ట్రక్షన్ జరగనుంది.

railwaybridge2దాదాపు ఈ బ్రిడ్జి హైట్ దాదాపు 1,177 అడుగుల ఎత్తులో నిర్మాణం జరుగుతోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న రైల్వే బ్రిడ్జి కన్నా ఇదే ఎక్కువ ఎత్తులో నిర్మాణం కానుంది. ఇండియన్ సైంటిస్టుల అద్భుత సృష్టితోనే ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోందని…2016 లోగా దీన్ని పూర్తి చేస్తామని ఇంజనీర్ ఒకరు అన్నారు. భూకంపాలు, భారీ గాలులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని నిర్మాణం చేపడుతున్నట్లు ఆ ఇంజనీర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కొంకన్ రైల్వే ఆధ్వర్యంలో జరుగోంది. బ్రిడ్జి వర్క్ 2002లోనే స్టార్ట్ అయ్యిందని ఆయన అన్నారు.

భరముల్లా నుంచి జమ్మూ ప్రాంతాలను కలిపేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడుతోంది. గతంలో ఆరు నుంచి ఏడు గంటల టైం పట్టేది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే సగం టైంలోనే గమ్యాన్ని చేరోచ్చని అధికారులు చెప్తున్నారు. 25 వేల టన్నుల స్టీల్ ఈ బ్రిడ్జి కోసం పడుతోందని.. కొన్ని లారీ, హెలికాఫ్టర్ల సాయంతో మెటీరియల్ ను  ట్రాన్స్ పోర్ట్ చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఛాలెంజ్ తో కూడుకున్నదని రైల్వే అధికారి అన్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy