టాప్ 200 వర్సిటీల్లో మన వర్సిటీలు లేవు

iitb150x150వాల్డ్ లోని టాప్ 200 యూనివర్సిటీల్లో ఒక్క ఇండియన్ యూనివర్సిటీ కూడా చోటు సంపాదించుకోలేక పోయింది. QS ఇంటర్నేషనల్ సంస్థ 2014-15 సంవత్సరానికి గాను జరిపిన సర్వేలో ఐఐటీ బాంబే ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, వాల్డ్ లో 222 ప్లేస్ లో నిలిచింది. గత పది QS ర్యాంకింగ్స్ లో ఇండియాలో టాప్ ప్లేస్ లో ఉన్న ఐఐటీ ఢిల్లీ, ఈ సారి సెకండ్ ర్యాంక్ కు పడిపోయి, వాల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ లో 235 ప్లేస్ లో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ లో అమెరికా లోని MIT ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా, లండన్ లోని ఇంపేరియల్ కాలేజి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఐఐటీ బాంబే అకడెమిక్స్, ఎంప్లయర్స్ పరంగా ఢిల్లీ కంటే ఐఐటీ మెరుగవడంతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. అకడెమిక్స్ విషయంలో ఐఐటీ బాంబే వాల్డ్ లో 160 ర్యాంకులో ఉండగా, ఎంప్లయర్స్ విషయంలో 60 వ స్థానంలో ఉంది. అయితే రీసెర్చ్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ పరంగా టాప్ 300 లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది.  ఈ ర్యాంకింగ్స్ లో ఐఐటీ మద్రాస్ (321), ఐఐటీ ఖరగ్ పూర్ (324), ఐఐటీ రూర్కీ (461) , యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ(430), ఐఐటీ గౌహతి (551), యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా (650) ప్లేసుల్లో ఉన్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy