ఇండియాలో స్మార్ట్ ఫోన్ల హవా!

5-13_samsung_smartphone_2మనదేశంలో స్మార్ట్ ఫోన్ల అమ్మకం రోజురోజుకి పెరుగుతోంది. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్ల ఉన్న స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం…ఇంటర్నెట్ వాడకం భారీగా పెరుగుతుండడంతో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను భారీగా పెంచుతున్నాయి. ఈ సంవత్సరం మొత్తం 20 కోట్ల ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. అందులో దాదాపు 5 కోట్ల 30 లక్షలు స్మార్ట్ ఫోన్లు ఉంటాయని చెప్తోంది ఓ రీసెర్చ్ సంస్థ. GFK రీసెర్చ్ సంస్థ వివరాల ప్రకారం ఇండియాలో ఈ సంవత్సరం 75 వేల కోట్ల విలువైన ఫోన్లు అమ్ముడైతే…ఇందులో స్మార్ట్ ఫోన్ల వాటా 52 వేల కోట్లు ఉంటుంది. అంతేకాదు, జనవరి-సెప్టెంబర్ ల మధ్య 14 కోట్ల 70 లక్షల ఫోన్లు అమ్ముడైతే…అందులో 3 కోట్ల 90 లక్షల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

టాప్ లో శామ్ సంగ్…

స్మార్ట్ ఫోన్లలో శామ్ సంగ్ కంపెనీ ఫోన్లను ఎక్కువగా కొంటున్నారు. జనవరి -సెప్టెంబర్ ల మధ్య అమ్ముడైన ఫోన్లలో శామ్ సంగ్ ఫోన్లు 34.2% ఉండగా, మైక్రోమ్యాక్స్ 17.9%, నోకియా 16.3%  ఫోన్లు ఉన్నాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy