ఇండియా, పాక్ లది కామన్ ఎజెండా : షరీఫ్

Nawaz Image 2శాంతి, ఆర్థిక స్థిరత్వంపై ఇండియా పాక్ లది కామన్ ఎజెండా అన్నారు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్. భారత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు తావు లేకుండా చాలా జాగ్రత్తగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీతో భేటీ చారిత్రాత్మకమైందని అన్నారు. మొదట ఆహ్వానం అందినపుడు కాస్త ఒత్తిడికి గురయ్యానని, కాని ఢిల్లీకి వచ్చాక తనకు ఇది ప్రత్యేక విశేషం గా భావించానని తెలిపారు. మోడీని పాకిస్తాన్ కు రావాలని ఆహ్వానించానని, మోడీ అంగీకరించారని తెలిపారు. ఇవాళ్టి భేటీలో తాము నిర్మాణాత్మకమైన చర్చ జిరిపినట్లు తెలిపారు. 1999 లాహోర్ డిక్లరేషన్ ను కొనసాగిస్తామని తెలిపారు. ఇండో పాక్ సంబంధాలకు స్పష్టమైన విధానం అవసరమన్నారు. ఇరు దేశాలకు ఆరోపణలు ప్రతిపంధకాలు కారాదని అభిప్రాయపడ్డారు. అన్ని విషయాలపై ఇండియాతో చర్చించేందుకు పాక్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాలుంటాయని హామీ ఇచ్చారు. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు త్వరలో భేటీ అవుతారని తెలిపారు. అనుమానాలు, అపనమ్మకాల నుంచి రెండు దేశాలు బయటకు రావాలని నిర్ణయించినట్లు తెలిపారు. శాంతి స్థిరత్వం లేకుండా అభివృద్ధి అసాధ్యమని, దీనిపై ఇరు దేశాలు సహకరించుకోవాలని అభిప్రాయపడ్డారు. పాక్, భారత్ లో ఇటీవలే ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే రెండు దేశాలకు స్పష్టమైన శాసనాలు అవసరమన్నారు. మోడీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy