ఇండియా – 2015

roundupదేశవ్యాప్తంగా 2015లో జరిగిన ముఖ్య ఘటనల సమాహారమే ఈ ఇండియా 2015…. ఆ విశేషాలు ఏంటో మీరూ చదవండి…

 • జనవరి 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త స్కీమ్ ను ప్రారంభించారు.  అంతకు ముందు ఉన్న ప్లానింగ్ కమిషన్ పేరును నీతి అయోగ్ గా మార్చారు. పేరుతో పాటు ప్రణాళికా సంఘం తీరును కూడా మారుస్తానని ఆ సందర్భంగా మోదీ తెలిపారు. సాధికారత, సమానత్వమే లక్ష్యంగా నీతి అయోగ్ స్కీమ్ ఏర్పడింది. ఈ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు మేధో సంస్థగా సేవలందిస్తోంది. మారిన దేశ పరిస్థితులనుగుణంగా ఈ నీతి అయోగ్ స్కీంను తయారు చేశారు.
 • 2015 జనవరి 26 న జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి అమెరికా అధ్యక్షుడు ఒబామా స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇరుదేశాలమధ్య సంబంధాలు మరింత బలపడాలనే ఉద్దేశంతో….మోదీ…ఒబామాను గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు. అంతకుమందు మోడీ అక్టోబర్ నెలలో అమెరికాను విజిట్ చేశారు. భారత్ దేశం అభివృద్ధి చెందాలంటే భారత్, అమెరికా దేశాల మధ్య టై కుదరాలనే ఉద్దేశంతో..ఒబామాను, మరికొంతమంది కంపెనీల సీఈవోలను కలిసారు.
 • ఫిబ్రవరి 8న జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 సీట్లకు 67 సీట్లు గెలుపొంది విజయం సాధించింది. అనంతరం..అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు 2014లో షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత జాన్ లోక్ పాల్ బిల్ కు సంబంధించి ప్రభుత్వంలో అసమర్ధత కనిపిస్తుందని…దాని నుండి తొలగిపోయారు. ఆ తర్వాత ఏడాది పాటు ఢిల్లీ లో ప్రెసెడెంట్ రూల్ నడిచింది. గవర్నర్ నజీబ్ జంగ్… కమిషన్ ఆఫ్ ఇండియాను ఫ్రెష్ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని కోరడంతో…2015 జనవరిలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేసింది.
 • ఫిబ్రవర్ 15న స్వైన్ ఫ్లూతో దేశవ్యాప్తంగా 585 మంది చనిపోయారని ఓ నివేదిక స్పష్టం చేసింది. మునుపెన్నడూ లేనివిధంగా స్వైన్ ఫ్లూ ఈ ఏడాది విజృభించడంతో… రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఎక్కువమంది చనిపోయినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాలలో కూడా స్వైన్ ఫ్లూ తో చాలామంది మరణించారు.
 • మార్చి 27న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజిపేయికి, మార్చి 30 న స్వాతంత్ర్య సమరయోధులు మధన్ మోహన్ మలావియాలకు ఉత్తమ పురస్కారమైన భారతరత్న దక్కింది. డిసెంబర్ 25న వాజిపేయి పుట్టిన రోజు సందర్భంగా… 2014 డిసెంబర్ 24న ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కొన్నాళ్లు ప్రెసిడెంట్ గా వ్యవహరించిన, ఇండిపెడెన్స్ మూమెంట్ లో పాల్గొన్న మధన్ మోహన్ మలావియాకు మరణానంతరం భారతరత్న దక్కింది.
 • ఏప్రిల్ 25న నేపాల్ లో భూకంపం సంభవించింది. ఇది రిక్టార్ స్కేల్ పై 7.8 గా నమోదైంది. సుమారు 9 వేల మందికి పైగా ఈ భూకంపానికి బలైపోయారు. ఇండియాలో 130 మంది చనిపోయారు.
 • మే 7న ఇండియా, బంగ్లాదేశ్ ప్రాదేశిక వివాదాలకు సంబంధించిన రాజ్యాంగ బిల్ ను పార్ల మెంట్ పాస్ చేసింది. ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలతో ఉన్న భారత్, బంగ్లాదేశాలకు ఈ బిల్ తో ఊరట కల్గింది. సరిహద్దులో ఉన్న 1500 ఎకరాల భూమిలో వెయ్యి ఎకరాలు బంగ్లాదేశ్ కు, 500 ఎకరాలు భారతదేశానికి పార్టిషన్ అయింది. సరిహద్దుల్లో ఉన్న ప్రజల శ్రేయస్సు కోసమే భారత ప్రభుత్వం…ఈ నిర్ణయం తీసుకుంది.
 • ఈ ఏడాది ఇస్రో… శాటిలైట్స్ ను అంతరిక్షంలోకి పంపడంతో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. పీఏస్ ఎల్ వీ సి 30 అనే ఆస్ట్రోనాట్ మిషన్ ను, పిఎస్ ఎల్ వి సి 29 అనే టెలియోస్ ఒన్ మిషన్ ను విజయవంతంగా ప్రయోగించింది. అదేవిధంగా పీఎస్ ఎల్ వి సి 28, డిఎమ్ సి 3 మిషన్ ను కూడా ఈ ఏడాదే ఇస్రో లాంచ్ చేసింది.
 • మార్చి 27 న కోలకతాలో ప్రధానమంత్రి సురక్షా బీమా, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, అటల్ పెన్షన్ యోజనా స్కీంలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాన మంత్రి సురక్షా బీమా…యాక్సిడెంట్ ఇన్సురెన్స్. ఈ స్కీమ్ బ్యాంక్ ఎకౌంట్లు ఉన్న 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వ్యక్తుల వరకూ వర్తిస్తుంది. ఈ బీమా ప్రీమియమ్ 12 లక్షల రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా… లైఫ్ ఇన్సురెన్స్ స్కీం. సంవత్సరానికి 330 రూపాయలు.. ఈ స్కీంలో కట్టాల్సి ఉంటుంది. ప్రమాదంలో ఆ వ్యక్తి చనిపోతే.. రెండు లక్షల రూపాయల నామినీకి అందజేస్తారు. అలాగే అటల్ పెన్షన్ యోజనా.. ఇది వృద్ధాప్యంలో అందే పెన్షన్. 18 నుంచి 40 ఏళ్లు వచ్చే వరకూ ఈ స్కీంలో డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కట్టే దాన్ని బట్టి ప్రతి నెలా  వెయ్యి రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకూ పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.
 • మే 11న అన్నా డీఎమ్ కే అధినేత్రి జయలలితను అధిక ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో కర్ణాటక హై కోర్టు నిర్దోషిగా తీర్పు చెప్పింది. దాంతో తమిళనాడులో జయలలిత అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. 1990లలో 66 కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టినట్టు జయలలితపై వేసిన కేసులో అంతకముందు కర్ణాటకలోని కోర్టు దోషిగా తీర్పు చెప్పింది. దాంతో కొన్నాళ్లు జైలు లో ఉన్న జయలలిత..ఆ తర్వాత ఆపీల్ చేసుకున్నారు. అధిక ఆస్తులు ఉన్నాయని తెలియజేసే సాక్ష్యాలు ఏవీ లేనందున కింద కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేసింది.
 •  జూన్ 9 న మయన్మార్ బోర్డర్ లో ఇండియన్ ఆర్మీ… రెండు మిలిటెంట్ గ్రూపులను హతమార్చింది.
 • అంతకుముందు జూన్ 4న జరిగిన ఎటాక్ కు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ.. సుమారు 20 మంది మయన్మార్ సైనికులను హతమర్చారు.
 • జూన్ 21న.. ఇండియన్ యోగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఆ రోజును ఇంటర్నేషనల్ యోగా డే గా ప్రపంచం గుర్తించింది. 2014, డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా డే గా డిక్లేర్ చేసింది. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, క్రమశిక్షణ కల్పించే దిశలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంధ్ర మోడీ యు.ఎన్.ఒ కి సజెస్ట్ చేయడంతో..ఈ నిర్ణయం తీసుకుంది.
 • జులై 27న పంజాబ్ లో గుర్దాస్పూర్ గ్రామంలోని పోలీసు స్టేషన్ పై టెర్రరిస్టులు ఎటాక్ చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు టెర్రరిస్టులతో పాటు ఆరుగురు పోలీసులు మృతి చెందారు.
 • జులై 27న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం… షిల్లాంగ్ లో చనిపోయారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఉపన్యాసం ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కూలబడి చనిపోయారు. తమిళనాడు రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం… సైంటిస్టుగా, రాజకీయనాయకుడిగా దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఫిజిక్స్, ఏరో స్పేస్ ఇంజనీరింగుల్లో పట్టాలు అందుకున్న కలాం….ఎందరికో స్ఫూర్తిదాయకం.
 • జులై 30న ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన యాకుబ్ మెమన్ ను ఉరితీశారు. 1993 ముంబయిలో జరిగిన బాంబుపేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్, తన సోదరుడైన టైగర్ మెమన్ కు, దావూద్ ఇబ్రహీంకు ఫైనన్సియల్ గా సపోర్టు చేసినందుకు….టాడా ఏక్ట్ కింద ఉరిశిక్ష ఖరార్ అయింది. ఆ తర్వాత యాకుబ్ ఆపీల్, క్షమాబిక్ష పిటీషన్లు పెట్టినా…ఫలితం దక్కలేదు. ఆఖరికి నాగాపూర్ లో చట్టపరంగా యాకుబ్ ను ఉరితీశారు.
 • ఆగష్టు 26న గుజరాత్ లో పటేల్ యాసిటేషన్ మొదలైంది. పటేల్ కమ్యూనిటీ కి రిజర్వేషన్ కల్పించాలని చేసిన గొడవల్లో 8 మంది చనిపోయారు. దాంతో కొన్ని ప్రాంతాలను ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది.
 • సెప్టెంబర్ 12న మధ్యప్రదేశ్ లోని పెట్లావాడ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలి..సుమారు 89 మంది చనిపోయారు. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బిల్డింగ్ లో జరిగిన పేలుడుకు పక్కనే ఉన్న రెస్టారెంట్, చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో కూడా మంటలు వ్యాపించడంతో….భారీ ప్రాణ నష్టం జరిగింది.
 • సెప్టెంబర్ 28న ఉత్తరప్రదేశ్ లో దాద్రి గ్రామంలో 50 ఏళ్ల ఆఖ్ లాఖ్ అనే ముస్లిం వ్యక్తి ని స్థానికులు దాడి చేసి చంపారు. అతడు ఆవు మాంసం తిన్నాడనే అనుమానంతో… 200 మంది స్థానికులు అతనిపై దాడి చేశారు. ఆ ఘటనలో అతను చనిపోగా తన కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఆవులను హతమార్చేవారిని ఉరిశిక్ష తీయాలని బిజేపీ నాయకుల్లో కొందరు అంటే.. ఆవుకు ఇచ్చిన ప్రాముఖ్యత మనిషికి ఇవ్వటంలేదని మరికొందరి వాదన. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే హర్యానాలో కులవివక్ష కారణంగా ఇద్దరు చిన్నారులు సజీవ దహనం అయ్యారు.
 • అక్టోబర్ 16న నేషనల్ జుడిషియల్ ఎపాయింట్మెంట్స్ కమిషన్… రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
 • అక్టోబర్ 19న దేశ వ్యాపంగా కందిపప్పు ధర 200 రూపాయలకు చేరింది. మునిపెన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా కందిపప్పు ధర పెరిగిపోయింది. గతేడాది కిలో 75 రూపాయలు ఉంటే..ఈ సారి అది రెట్టింపు అయింది. దేశంలో సాగు విస్తీర్ణం తగ్గడం, విదేశాల్లో నిల్వలు పడిపోవడమంతో ఒక్కసారిగా కందిపప్పు దిగుబడి తగ్గిపోయింది. అదేవిధంగా మిగతా  పప్పుధ్యాన్యాల రేట్లు కూడా 35 శాతం నుంచి 45 శాతం వరకూ పెరిగిపోయాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు…సబ్సిడీపై కందిపప్పును విక్రయించారు.
 • నవంబర్ 26న దేశం.. రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంది. ఈ దశలో రాజ్యాంగంపై లోకసభ రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. రాజ్యాంగ దినోత్సవాన్ని, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి పురస్కరించుకుని ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. కానీ భిన్నత్వంలో ఏకత్వమని మురియడం తప్ప దాన్ని సహించే తత్వాన్ని కోల్పోతున్న జాడలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని…సమావేశంలో కొందరు వాదించారు. అదేవిధంగా రాజ్యాంగం రూపుదిద్దుకుంటున్న సమయంలోనే ప్రాచీన భారతీయ విలువలు, మనుధర్మ సూత్రాల స్ఫూర్తికి బదులు బ్రిటన్, అమెరికా, కెనడా తదితర దేశాల రాజ్యాంగంలోని అంశాలే అందులో ఎక్కువ పొందుపరిచారని సభలో కొంతమంది విమర్నించారు. దాంతో రాజ్యాంగాన్ని విమర్శిస్తే.. డా బి ఆర్ అంబేద్కర్ ని కూడా విమర్శించినట్టేనని… కొంతమంది గొడవచేయడంతో.. సమావేశాలు చర్చనీయాశంగా మారిపోయాయి. ఆ తర్వాత….ప్రధాని మోదీ తన ప్రసంగంలో అన్ని వర్గాలూ, మతాలకూ చెందిన ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజ్యాంగం దేశంలోని అన్నివర్గాలు, మతాలకు చెందినదని…స్పష్టం చేశారు.
 •  నవంబర్ 29న జరిగిన బీహార్ ఎలక్షన్స్ లో జనతా పరివార్ గ్రూప్ విజయం సాధించింది. జనతాదళ్ అధినేత నితీశ్ కుమార్ బీహార్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో జనతా దళ్ పార్టీతో పాటు మరో నాలుగు జనతా పార్టీలు…కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్నాయి. బిజెపి లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, హిందుస్తాన్ యావం మోర్చలతో పొత్తు పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. ఈ ఎన్నికల్లో 2000 సంవత్సరం తర్వాత ఎక్కువ శాతం పోలింగ్ కావడం విశేషం.
 • నవంబర్ నెల లో భారీ వర్షాలతో, వరదలతో చెన్నై నగరం అతలాకుతలం అయిపోయింది. ఎప్పుడూ కనివినీ ఎరగని రీతిలో 119 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదై… ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఊర్లు సెలయేర్లుగా, వీధులు…చెరువులుగా మారిపోయాయి. తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోయారు. ఈ విపత్తులో సుమారు 200 మందికి పైగా చనిపోయారు.
 • డిసెంబర్ 10న హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్ ని నిర్ధోషిగా విడుదల చేసింది. మితిమీరి మద్యం సేవించిన ప్రభావంతో వేగంగా కారును నడిపి, పేవ్ మెంట్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి మరణానికి, మరో నలుగురు గాయాలపాలు అవ్వడానికి కారణమయ్యాడన్న ఆరోపణలతో సల్మాన్ పై కేసు నమోదయింది. ఈ ఆరోపణలకు సరైన సాక్షాధారాలు లేనందున కోర్టు కేసును కొట్టి వేసింది. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ తాగి ఉన్నట్టుగానీ,  డ్రైవింగ్ చేస్తున్నట్లు గానీ సాక్షాధారాలను ప్రాసిక్యూషన్ కోర్టులో నిరూపించకపోవడంతో…సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు.
 • డిసెంబర్ 22 న ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సమీపంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఇందులో ఉన్న పది మంది బీఎస్ఎఫ్ సాంకేతిక నిపుణులు చనిపోయారు. అప్పుడే ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న విమానం.. సాంకేతిక కారణంతో కూలిపోయింది. అందులో ఉన్న వారంతా అనుభవజ్ఞులైన ఎయిరో ప్లేన్ సీనియర్ టెక్నిషియన్స్. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించినా..కూడా ఫలితం లేకపోయింది. సీనియర్ టెక్నిషియన్స్ ఎయిర్ క్రాష్ లో చనిపోవడంతో ప్రధాని మోదీ వారికి సానుభూతిని ప్రకటించారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy