ఇండో-పాక్ మధ్య సిరీస్ లేనట్టే

anuragకొత్త సంవత్సరంలో కూడా ఇండియా-పాక్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ లేనట్లేనని ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్టు కార్యదర్శి అనురాగ్ ఠాగూర్ తెలిపారు.  ప్రస్తుతానికి అలాంటి ఆలోచన తమకు లేదన్నారు. కేవలం మల్టీ నేషనల్ టోర్నమెంట్లో మాత్రమే భారత్…పాక్ తో ఆడే అవకాశముందన్నారు. ఇండో-పాక్ సిరీస్ కోసం గతేడాది అంతా చర్చలు జరిగాయి. గత డిసెంబర్ లో సిరీస్ ఉండవచ్చని అంతా అనుకున్నారు. అయితే రెండు దేశాల బోర్డర్స్ లో కాల్పులు జరగడంతో ఆ సిరీస్ నిర్వహించలేదు. ఈ ఏడాది కూడా  సిరీస్ నిర్వహించే అవకాశం లేదని ఠాకూర్ స్పష్టం చేశారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy