ఇంత కాస్ట్లీనా: గజం లక్షన్నర దాటింది

landహైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెదటంతో పాటు…అనే కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టుందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో చుట్టు పక్క ప్రాంతాల్లోని భూముల ధరలకు అమాంతంగా రెక్కలు వచ్చాయి. ఊహించనంతగా ధరలు పలుకుతున్నాయి. గజం ధర అనుకున్నదానికి రెండింతలు పలుకుతున్నాయి.

మాదాపూర్‌లో గజం ధర రూ.1.52లక్షలు.. చందానగర్‌లో రూ.70వేలు.. మియాపూర్‌లో రూ.62,600.. నల్లగండ్లలో రూ.42వేలు ఉంది. నెల రోజుల కిత్రం HMDA ప్లాట్ల వేలానికి ప్రకటన ఇచ్చింది. వేలం ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని చెప్పి, దానికనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం(ఏప్రిల్-23) నిర్వహించిన మొదటి రోజు ఆన్‌లైన్‌ వేలం (ఈ-వేలం)లో మాదాపూర్‌లోని ఇమేజ్‌ గార్డెన్‌ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో గజానికి రూ.64 వేలను నిర్ణయించగా.. ఆన్‌లైన్‌ వేలంలో రూ.1.52లక్షలు కోట్‌ చేశారు. మియాపూర్‌లో గజం ధర రూ.24వేలు నిర్ణయించగా వేలంలో రూ.62,600 పలికింది. మొదటి రోజు నిర్వహించిన వేలంలో ప్లాట్లకు అనూహ్య రీతిలో ధరలు వచ్చాయి.

మొదటి రోజు ఈ-వేలంలో 74 ప్లాట్లను అమ్మగా మొత్తం రూ.182 కోట్లు వచ్చినట్లు HMDA తెలిపింది. ఈ-వేలం రాత్రి వరకు కొనసాగిందని, వేలం నిర్వహించిన సంస్థ MSTC నుంచి పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉందని తెలిపింది. బహిరంగ మార్కెట్లో ప్రాంతాలను బట్టి రకరకాల ధరలు ఉన్నా.. HMDA  ప్లాట్లకు ఈ స్థాయిలో డిమాండ్‌ ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. 23, 24 తేదీల్లోనూ ఈ-వేలం ఉంటుందని అధికారులు తెలిపారు. మరో 187 ప్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు వివరించారు. ప్లాట్ల అమ్మకంతో రూ.300 కోట్లు వస్తాయని మొదట అంచనా వేశామని.. స్పందనను చూస్తే రూ.450 కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పారు.

HMDA అమ్మకానికి పెట్టిన ప్లాట్లను కొనుగోలు చేసేందుకు విదేశాల్లో ఉంటున్న వారు కూడా ఆసక్తి చూపుతూ రిజిస్ట్రేషన్  చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy