ఇంత క్రూరత్వమా : కూతురిని కొట్టి చంపిన తల్లి

baby-deathప్రేమతో లాలించాల్సిన తల్లే..ఓ చిన్నారి పాలిట యమపాశమైంది. చెప్పిన పని చేయడం లేదని కన్నతల్లే చితకబాదడంతో అభంశుభం తెలియని బాలిక మృతిచెందిన సంఘటన నగరంలోని బాలాపూర్‌ ఠాణా పరిధిలో జరిగింది. జమ్‌జమ్‌ కాలనీలో ఉండే ఫిరోజ్‌బేగం, ఫెరోజ్‌ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. మూడేళ్ల కిందట భర్తతో విడాకులు తీసుకున్న ఫిరోజ్‌బేగం ఆజం అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతని ద్వారా ఫిరోజ్‌ బేగానికి మరో ఇద్దరు పిల్లలు కలిగారు. కొంతకాలంగా ఆమె తన మొదటి భర్త ద్వారా కలిగిన పిల్లలను కఠినంగా దండిస్తోంది. ఆ ముగ్గురు పిల్లల్లో పెద్దదైన ఫిర్దోస్‌ ఫాతిమా(8)తో ఇంటి పనులన్నీ చేయిస్తూ, చీటికీ మాటికీ తిడుతూ కొడుతుంది.

కొన్ని రోజుల కిందట ఫాతిమా జ్వరానపడి లేవలేని స్థితికి చేరినప్పటికి మాతృత్వాని మంటగలిపే విధంగా క్రూరంగా వ్యవహరించింది ఆ తల్లి. ఇంటిపని చేయమని లేవలేని స్థితిలో ఉన్న ఫాతిమాను ఇష్టానుసారంగా చితుకబాదింది ఫిరోజ్‌బేగం. చిన్నారి కంటి భాగంపై బలమైన గాయమై కిందపడిపోయింది. కొద్ది సమయం అనంతరం ఫాతిమాను కదిలించే ప్రయత్నం చేయడంతో పలకలేదు. దీంతో అనుమానం వచ్చి చిన్నారిని బార్కాస్‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించిందని చెప్పారు డాక్టర్లు. సమాచారం అందుకున్న పోలీసులు ఫిరోజ్‌బేగాన్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy