ఇంత నిర్లక్ష్యమా : పేషెంట్ కంటిని కొరికేసిన ఎలుక

hosహాస్పిటల్ లో కోమాలో ఉండి చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ కంటిని ఎలుకలు కొరికి గాయపరిచాయి. ఏప్రిల్-23న ముంబైలోని బాల్‌ థాక్రే ట్రామా కేర్‌ హాస్పిటల్ లో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై బాధితుడి తండ్రి గుప్తా మాట్లాడుతూ.. మార్చిలో తమ కొడుకు పరమిందర్‌(27) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో హాస్పిటల్ లో చేర్చామని తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో 40 రోజులు గడిచిన తర్వాత కూడా అతడిలో ఏ మార్పు రాకపోవడంతో ఏప్రిల్‌ 21న వైద్యులు కోమాలో ఉన్న తన కుమారుడిని జనరల్‌ వార్డుకు తరలించారని తెలిపారు. జనరల్‌ వార్డులో ఎలుకలు తిరగడం తాను కళ్లారా చూశానని, తన కుమారుడి కంటి నుంచి ఒక్కసారిగా రక్తం రావడంతో దగ్గరికి వెళ్లి చూస్తే ఎలుకలు కొరికిన గుర్తులు కనిపించాయని ఆయన తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని పేషెంట్‌ బంధువులు తెలిపారు. అయితే హాస్పిటల్ లో ఎలుకలు సంచరించడం లేదని, తమ ఆస్పత్రి పేరును పాడుచేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, పేషెంట్‌ ని కంటికి ఎటువంటి గాయం కాలేదని హాస్పిటల్ యాజమాన్యం చెబుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy