ఇందిరాగాంధీ మహోన్నత నేత: ప్రణబ్

pranabhరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీడ్కోలు కార్యక్రమం పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ప్రణబ్. తన రాజకీయ ప్రస్థానానికి మార్గదర్శి ఇందిరాగాంధీ అన్నారు. ఇందిరాగాంధీ ఓ మహోన్నత నాయకురాలని చెప్పారు. 1969 జూలైలో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టానని.. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశానన్నారు. లోక్‌సభకు రెండుసార్లు ఎన్నికయ్యానన్నారు. తాను సభలో అడుగుపెట్టినపుడు స్వాతంత్ర సమరయోథులు, అపరమేథావులు ఉన్నారని ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీల సంతకాలతో కూడిన పుస్తకాన్ని ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు.

వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఎంపీలు, కేంద్రమంత్రులు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్, ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోపాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy