ఇందిరా గాంధీ 101వ జయంతి.. నేతల ఘన నివాళి

 న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 101వ  జయంతి సందర్భంగా కాంగ్రెస్, బీజేపీతో పాటు పలువురు నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత..మాజీ హోం మంత్రి ఎల్ కే అద్వాణి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ మట్లాడుతూ మన్మోహన్ సింగ్ ను కొనియాడారు. మన్మోహన్ గొప్పవ్యక్తి అని వారు ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ అత్యధిక వృద్ది రేటు సాధించిందని చెప్పారు. ఎక్కువకాలం ప్రధానిగా పనిచేసిన ఘనత కూడా ఆయనదేనని అన్నారు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy