‘ఇందు స‌ర్కార్ ‘ కి అరుదైన గౌరవం

neil-mukeshఇటీవల రిలీజైన బాలీవుడ్ మూవీ ఇందు సర్కార్ కి అరుదైన గౌరవం దక్కింది. 1975-77 మ‌ధ్య ఇందిరాగాంధీ స‌ర్కార్ దేశంలో విధించిన‌ ఎమ‌ర్జెన్సీ ఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కిన ఇందు స‌ర్కార్ సినిమాను.. 15వ బాలీవుడ్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. సెప్టెంబ‌ర్ 8 నుండి నార్వేలో మొద‌లు కానున్న ఈ ఫిలిం ఫెస్టివ‌ల్‌కి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ ఫిలింమేక‌ర్ మ‌ధుర్ బండార్కర్ గెస్ట్‌గా హాజ‌రు కానున్నాడ‌ట‌. ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీ నుండి ప‌లువురు స్టార్ హీరోలు కూడా ఈ ఫిలిం ఫెస్టివ‌ల్‌కి హాజ‌రు కానున్నార‌ని బాలీవుడ్ స‌మాచారం. కృతి కుల్హారీ, నీల్ నితిన్ ముఖేష్, అనుప‌మ్ ఖేర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన ఈ మూవీని మ‌ధుర్ బండార్క‌ర్ తెర‌కెక్కించారు. జూలై 28, 2017న విడుద‌లైన ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ ల‌భించిన విషయం తెలిసిందే.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy