ఇకపై అడ్రస్ ప్రూఫ్ గా పాస్ పోర్ట్ పనికి రాదు

Indian-Passportఅడ్రస్ ప్రూఫ్ గా పాస్ పోర్ట్ ఇకపై పనికిరాదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. త్వరలో పాస్ పోర్టు రూపురేఖలు మారనున్నాయి. దీంతో అది కేవలం విమాన ప్రయాణాలకు మాత్రమే పనికి రానుంది. అయితే ఈ విషయాలను గోప్యంగా ఉంచుతోంది విదేశాంగ శాఖ. విశ్వసనీయ సమాచారం ప్రకారం… సాధారణంగా పాస్ పోర్ట్ మూడు రంగుల్లో ఉంటుంది. ఒకటి వైట్ … రెండోది రెడ్… మూడోది బ్లూ. వీటిల్లో తెల్లరంగులో ఉండే పాస్ పోర్ట్ కేవలం విదేశీ పర్యటనలు చేసే ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఉపయోగిస్తారు. రెడ్ పాస్ పోర్టు రాయబారులు వినియోగిస్తే… మూడోదైన నీలిరంగు పాస్ పోర్టులు సాధారణ పౌరులు ఉపయోగిస్తారు. అయితే తాజాగా ఆరంజ్ కలర్ లో పాస్ పోర్టు తీసుకురానున్నట్టు సమాచారం. దీంతో పాటు పాస్ పోర్టు చివరిలో ఉండే ECR(emigration check)ను కూడా మారుస్తున్నట్టు చెబుతున్నారు. ఈసీఆర్ పేజీని ఇకపై ఖాళీగా ఉంచనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఈ మార్పుల వల్ల… పాస్ పోర్టును అడ్రస్ ప్రూఫ్ గా పరిగణించే అవకాశాలు పోనున్నాయి. ఈసీఆర్ ను తీసేయ్యడం వల్ల.. వ్యక్తుల పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉండదు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy