ఇకపై ఇంట్లోనే మీ సేవ…

Ap Online Logo MEE SEVAప్రభుత్వ సేవల కోసం ఇకపై మీ సేవ కేంద్రాలకు వెళ్లనక్కర్లేదు. మీ సేవా కార్యాలయాలకు గడప తొక్కనక్కర్లేదు. మనకు కావాల్సిన సేవలన్నీ మన ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకునేలా మీ సేవ ఆన్ లైన్ పోర్టల్ ను రిలీజ్ చేశారు రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, రఘవీరా రెడ్డి. టెక్నాలజీని వినియోగించుకోని ప్రభుత్వం ప్రజలకు చాలా రకాల సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి చెప్పారు.ఇక రాష్ట్రంలో ఐటీ రంగానికి మంచి భవిష్యత్ ఉందన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.  రాష్ట్రంలో 4జీ సేవలు అందించేందుకు 12 పట్టణాలను ఎంపిక చేశామన్నారు. మరో మూడు వేల మీ సేవా కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. మీ  సేవా వెబ్ సైట్ లో ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత పోర్టల్ లోకి ప్రవేశించి అవసరమైన సేవలను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి గనులు, ఐటీ, పరిశ్రమలు, రెవిన్యూ, వ్యవసాయ శాఖలకు చెందిన 37 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చారు.

మనకు కావాల్సిన విభాగానికి వెళ్ళి అప్లికేషన్ పూర్తి చేయాలి. దీంతో పాటు దానికి కావాల్సిన కొన్ని సర్టిఫికేట్స్ ను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. ఇలా ఆన్ లైన్ లో పూర్తి చేయడం కుదరకపోతే అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసి పూర్తి చేసి స్కాన్ చేసి అప్ లోడ్ చేయాచ్చు. అపుడు సంబంధిత అధికారులు వీటిని అనుమతిస్తారు. లేదా తిరస్కరిస్తారు. మన అప్లికేషన్ ఏ స్టేటస్ లో ఉందో కూడా తెలుసుకునే సదుపాయాన్ని కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy