ఇకపై మేం పీఓకేలో ఉండలేం

PoKపాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జనాలపై ఇన్నాళ్లూ నవాజ్ సర్కార్ చేస్తున్న ప్రచారం.. చెబుతున్న ముచ్చట్లు అంతా ఉత్తవే అని తేలిపోయింది. పీఓకే ఏరియాలో భారీ సంఖ్యలో రోడ్డెక్కిన జనం…  ఇండియాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఇన్నాళ్లూ కాశ్మీర్ పై అంతెత్తున లేచిన పాకిస్థాన్.. ఇప్పుడు ప్రపంచానికి సమాధానం చెప్పాల్సిన టైమొచ్చింది.

 

వేల సంఖ్యలో రోడ్డెక్కిన పాక్ ఆక్రమిత కాశ్రీర్ జనం

పాక్ కు వ్యతిరేకంగా, భారత్ కు అనుకూలంగా నినాదాలు

భారత్  అనుకూల నినాదాలు చేసిన వారిపై విరిగిన లాఠీలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్  ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మా కాశ్మీర్ లోకి ఎందుకొచ్చారు? మమ్మల్ని వదిలి వెళ్లిపోండి అంటూ పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న కశ్మీరీ జనంపై … ఆ దేశ పోలీస్ బలగాలు విరుచుకుపడ్డాయి. ముజఫరాబాద్, గిల్గిట్, కోట్లీ ప్రాంతాల్లో… భారత అనుకూల నినాదాలు చేసిన వాళ్లను లాఠీలతో చావబాదారు పోలీసులు. తూటాలతో బెదరించే ప్రయత్నం చేశారు. అయినా… పాక్ ప్రభుత్వ తీరుపై… అక్కడి జనాల్లో నిరసన గళం ఏ మాత్రం తగ్గలేదు.

ఇప్పటికిప్పుడు జనాలు పీవోకేలో ఆందోళనకు దిగలేదు. ఇలాంటివి కొన్నేళ్లుగా జరుగుతూనే ఉన్నా… విషయాన్ని ఏ మాత్రం బయటికి రానీయకుండా పాక్ సర్కార్ అడ్డుకుంది. చివరికి.. పెల్లుబికిన జనాగ్రహం ముందు.. పాక్ బలగాల ప్రతాపం నిలవలేకపోయింది. పాక్ నుంచి ఫ్రీడమ్ కోరడం మాత్రమే కాదు… ఇండియా ఈజ్ ఎ బెటర్ కంట్రీ అంటూ ఓపెన్ గా కామెంట్ చేయడం… పీవోకే జనాల్లో ఉన్న ఆకాంక్షను, ఆగ్రహాన్ని స్పష్టం చేస్తోంది.

ఇన్నాళ్లూ కాశ్మీర్ పై అడ్డగోలు వాదనలు చేసిన పాకిస్థాన్.. మన దేశ తీరును పూర్తిగా తప్పుబడుతూ వచ్చింది. ఐక్యరాజ్యసమితి వేదికపై కూడా అడ్డగోలు అబద్ధాలు చెప్పుకొచ్చింది. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా వివాదం చేసేందుకు వీలైనంతగా ప్రయత్నించింది. కానీ.. ఇప్పుడు పీవోకేలో వేలాది మంది ఆందోళనను అడ్డుకుంటోంది. దీంతో పాక్ బలగాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన విషయం తేలిపోయింది. ఈ విషయంపై… సైలెంట్ గా ఉన్న నవాజ్ షరీఫ్ సర్కార్… ప్రపంచానికి వాస్తవం చెప్పాల్సిన సమయం వచ్చింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy