ఇకపై రాజకీయాలు మాట్లాడను : వెంకయ్య నాయుడు

venkaiahరాజ్యసభలో అర్థవంతమైన చర్చ జరిగేలా సభను నడిపిస్తానన్నారు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు. దీనికోసం సర్వేపల్లి రాధాకృష్ణన్‌, హిదయతుల్లా, జాకీర్‌ హుస్సేన్‌ సభను నడిపిన తీరును అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారాయన.  హైదరాబాద్‌ సోమాజీగూడలోని ఓ హోటల్‌లో మీడియాతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఉపరాష్ట్రపతి కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. ఇకపై పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటే బాధగా ఉంది.. ఇకపై రాజకీయాలు మాట్లాడనన్నారు వెంకయ్య. నేను ఇప్పటివరకు దేశంలోని 623 జిల్లాల్లో పర్యటించాను. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కనీసం 20 సార్లైనా పర్యటించాను. రాజకీయ నేతలు ప్రజల్లో ఉంటేనే రాణిస్తారన్నారు వెంకయ్య నాయుడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy