ఇక్కడి నుంచి వెళ్లాక : బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ గా రాజన్

RAGUరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(BOE) గవర్నర్ గా భాధ్యతలు చేపట్టబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. లండన్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ లో ఈ కథనం వచ్చింది. చికాగోకి చెందిన ఎకనామిస్ట్, మాజీ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ ను.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ పదవిని చేపట్టే అవకాశాలున్నాయని  చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం గవర్నర్ గా ఉన్న మార్క్ కార్నీ స్ధానంలో వచ్చే ఏడాది రఘురామ్ రాజన్ ఈ పదవి చేపట్టటానికి అవసరమైన ప్రాసెస్ ను ప్రారంభించినట్లు UK ఛాన్సెలర్ ఫిలిఫ్ హమోండ్ తెలిపారు. రాజన్ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ఫ్రొఫెసర్ గా ఉన్నారు. ఈ లిస్ట్ లో భారత్ కు చెందిన మరో వ్యక్తి స్రితి వదేరా పేరు కూడా ఉంది. స్రితి వదేరా యూకే మాజీ బిజినెస్ మినిస్టర్ గా సేవలందించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy