ఇక ఎంజాయ్ : 35 ఏళ్ల తర్వాత సౌదీ లో సినిమాలు

DFGసౌదీ అరేబియా అనగానే డెవలప్ మెంట్ విషయం ఎలా ఉన్నా… కఠినమైన ఆంక్షలే అందరికీ గుర్తుకు వస్తాయి. అయితే ఇప్పుడు ఆ పేరుని చిన్నగా తుడిపేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. అందులో భాగంగానే మతపరమైన కారణాలతో 35 ఏళ్లుగా సౌదీ అరేబియాలో కొనసాగుతున్న సినిమా థియేటర్ల నిషేధానికి ఈ రోజు(ఏప్రిల్-19) తో తెరపడింది. హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన బ్లాక్‌ పాంథర్ అనే యాక్షన్‌‌ సినిమా ఈ రోజు సౌదీలో విడుదల కానుంది. AMC ఎంటర్ టైన్ మెంట్స్ అనే అమెరికన్ థియేటర్ మార్కెట్ కు సౌదీలో సినిమాలు ప్రధర్శించేందుకు మొదటి లైసెన్స్ వచ్చింది. గత డిసెంబరులో సౌదీ అరేబియాతో AMC ఒప్పందం చేసుకుంది .  రాబోయే 5 ఏళ్లలో 15 నగరాల్లో 40 సినిమా థియేటర్లను AMC నిర్మించనుంది.   తగ్గుతున్న చమురు ఆదాయాన్ని వినోద రంగం నుంచి పొందాలని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy