ఇక ఓట్లు వేయటమే : కర్నాటక ఎన్నికల ప్రచారం క్లోజ్

karnatakaహేమాహేమీల హోరా హోరీ ప్రచారం. ప్రధాని మోడీ ఏకంగా 20 ర్యాలీలు, సభల్లో పాల్గొంటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏకంగా 20 రోజులు కర్నాటక రాష్ట్రంలో మకాం పెట్టారు. అమిత్ షా, కేంద్ర మంత్రులు క్యూ కట్టారు. యూపీ సీఎం యోగీ కూడా రెండుసార్లు బెంగళూరు చుట్టేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విధంగా బీజేపీ – కాంగ్రెస్ పార్టీలు ప్రచారం దుమ్మురేపాయి. గల్లీ గల్లీని చుట్టేయటంతోపాటు.. రోడ్ షోలు.. బహిరంగసభలు.. ర్యాలీతో కన్నడ ప్రజల మనస్సులు దోచుకోవటానికి సర్వశక్తులు ఒడ్డాయి పార్టీలు. 40 రోజులు మోత మోగించిన మైకులు మూగబోయాయి.
సర్వశక్తులు ఒడ్డిన బీజేపీ :
బీజేపీ మరింత ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, 50 మంది ముఖ్యనేతలు కర్ణాటకలోనే మకాం పెట్టారు. కన్నడ ప్రజలను ఆకట్టుకునేందుకు చాలా ప్రయత్నించారు ప్రధాని మోడీ. స్థానిక పరిస్థితులు, సంస్కృతి, రాష్ట్రంలోని గొప్పవ్యక్తులను.. ఇలా ప్రజలను ప్రభావితంచేసే ప్రతీ ఒక్క అంశాన్ని టచ్ చేస్తూ.. తన ప్రచారాన్ని కొనసాగించారు. రాహుల్ గాంధీని, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను టార్గెట్ చేశారు మోడీ. చేతిలో పేపర్ లేకుండా రాహుల్ ఒక్క మాట మాట్లాడలేడంటూ.. పర్సనల్ గా ఎటాక్ చేశారు. అటు.. సిద్ధరామయ్య పాలనలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయంటూ తీవ్రంగా విమర్శించారు. అటు.. పార్టీ చీఫ్ అమిత్ షా కూడా ఇదే పనిచేశారు. చివరి రోజు అమిత్ షా తో కలిపి మొత్తం 52 మంది నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
గెలుపు ధీమాలో కాంగ్రెస్ ప్రచారం :
కాంగ్రెస్ కూడా ప్రచార జోరు కొనసాగించింది. రాహుల్ గాంధీ మొదటి నుంచి ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు. రోడ్ షోలు, బహిరంగసభలతో ప్రజల్లోకి వెళ్లారు. ప్రధాని మోడీతో పాటు.. కర్ణాటక సీఎం అభ్యర్థి యాడ్యూరప్పను టార్గెట్ చేశారు. జైలుకు వెళ్లివచ్చిన యడ్యూరప్ప, మరో 8 మంది మంత్రులు.. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని.. బీజేపీది అవినీతి పాలన అంటూ ఫైర్ అయ్యారు రాహుల్. మరోవైపు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఎన్నికల ప్రచారంలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చి ప్రజలను ఎట్రాక్ట్ చేశారు. అటు సిద్ధరామయ్య కూడా వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లారు.
కింగ్ మేకర్ గా JDS ప్రచారం :
తమదే అధికారమంటూ జనతాదళ్ సెక్యులర్ చెబుతోంది. దేవేగౌడ, అతని కుమారుడు కుమారస్వామి జోరుగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు విసిగిపోయారని నేతలు చెబుతున్నారు. MIM అధినేత ఓవైసీ కూడా జేడీఎస్ తరఫున ప్రచారం చేశారు. కేసీఆర్ కూడా జేడీఎస్ కు ఓటెయ్యాలని చెప్పారు. మిగతా స్థానిక పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేశాయి. గెలుపుపై ధీమాగా ఉన్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy