ఇక గవర్నర్ నిర్ణయమే మిగిలింది..

tamil-nadu-cmతమిళనాడులో రాజకీయ ఉత్కంఠ పీక్స్ కు చేరింది. ఏక్షణమైనా గవర్నర్ నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటులో అవకాశమివ్వాలని కోరారు. తనకు మద్దతిస్తున్న మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ను కలిశారు. పూర్తిస్థాయి ప్రభుత్వ ఏర్పాటులో తనకే అవకాశమివ్వాలని ఆయన గవర్నర్ ను కోరారు.

అంతకుముందు… తన సపోర్టర్స్ తో గవర్నర్ ను కలిశారు అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత పళని స్వామి. తనకు మద్దతిస్తున్న మంత్రులు… నేతలతో కలిసి ఆయన గవర్నర్ ను కలిశారు. మొత్తం 124 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని.. వారి సంతకాల రిపోర్ట్ ను ఆయన గవర్నర్ కు సమర్పించారు. ప్రజాస్వామ్యంపై తమకు విలువుందని… తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy