ఇక టచ్ చేసి చూడండి రా : పిల్లలను రేప్ చేస్తే ఉరి శిక్ష

rapeచిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలని కేంద్రం నిర్ణయించింది. లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే పోస్కో చట్టానికి సవరణ చేస్తూ కేంద్ర మంత్రివర్గం ఈ రోజు(ఏప్రిల్-21) ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ఉమా భారతి, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పియూష్ గోయల్, హర్షవర్థన్ రాథోడ్, రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఆర్డినెన్స్ జారీ అవుతుంది. ఇటీవల చిన్నారులపై లైంగిక దాడులు అధికమవుతున్న సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy