ఇక బంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు : ఇంటికే డీజిల్

HP HOME DESELవాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ. ఇప్పటికే రోజూ పెట్రోలో, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న వాహనదారులకు ఈ న్యూస్ కాస్త ఉపశమనం కలిగించేదే అవుతుంది. ఇక డీజిల్ కోసం బంకుకు వెళ్లాల్సిన పనిలేదు.  ఇంటికే డీజిల్‌ ను సరఫరా చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతానికి ముంబైకే పరిమితమైన ఈ స్కీమ్‌ ను త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నది. HP ఫ్యుయెల్ కనెక్ట్ పేరుతో దీనిని ప్రారంభించింది. భారీ మెషినరీ ఉన్న కొంతమంది ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ సేవలు అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది HPCL. గత మార్చి నెలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పుణెలో ఈ స్కీమ్‌ ను ప్రారంభించింది. ఓ చిన్న ట్రక్‌ కు డీజిల్ డిస్పెన్సర్‌ ను అమర్చి అవసరమైన కస్టమర్ల ఇళ్లకు వెళ్లి డీజిల్ ఇస్తున్నది.

డీజిల్ అవసరం ఎక్కువగా ఉండే ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు, జనరేటర్లను వాడే షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలకు మొదట్లో IOC డీజిల్ సరఫరా చేస్తుండేది. బ్యారెళ్లలో డీజిల్‌ ను తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉండే కస్టమర్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. పెట్రోల్ బంకుల దగ్గర క్యూలను నివారించడానికి ఇళ్లే పెట్రోల్, డీజిల్‌ ను సరఫరా చేస్తామని ఇప్పటికే చెప్పారు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.  అయితే పెట్రోల్, డీజిల్ మండే గుణం కలిగిన ఇంధనాలు కావడంతో వీటిని హోం డెలివరీ చేయడానికి పెట్రోలియం అండ్ ఎక్స్‌ ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రయోగ పద్ధతిలో ఇళ్లకు డీజిల్ డెలివరీకి అనుమతి ఇచ్చింది.

 

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy