ఇక సిగ్నల్స్ ఫుల్ : జీశాట్‌-6A సూపర్ సక్సెస్

gsat2903షార్ నుంచి  GSLV-F 08 రాకెట్‌ ప్రయోగం జరిగింది. గురువారం (మార్చి-29)  సాయంత్రం సరిగ్గా 4.56 గంటలకు నింగిలోకి దూసుకుపోయింది రాకెట్. ఈ GSLV-F 08 రాకెట్‌ ద్వారా దేశ కమ్యూనికేష్‌ వ్యవస్థకు సంబంధించిన జీశాట్‌-6A ప్రయోగం జరగనుంది. మొబైల్‌ రంగంలో పదేళ్లపాటు జీశాట్‌-6A సేవలందించనుంది. ఒకే శాటిలైట్ ద్వారా రెండు బ్యాండ్ ల నుంచి సర్వీసులు అందించనుంది ఇది.

రాకెట్‌ ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. శాటిలైట్ కోసం రూ.270 కోట్లు ఖర్చు చేసింది ఇస్రో. బుధవారం (మార్చి-28) మధ్నాహ్నం 1:56 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 2 వేల 140 కిలోలున్న జీశాట్-6A ఉపగ్రహం..ఫస్ట్, సెకండ్, థర్డ్ దశల్లోనూ విజయవంతంగా చేరుకుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy