ఇక సోలార్ ట్రైన్లు..!!

railడీజిల్, కరెంట్ ప్లేస్ లో సోలార్ ప్యానెల్స్

కొత్త ప్రయోగంతో ఇండియన్ రైల్వేస్

దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ ఇండియన్ రైల్వే. రోజూ కోట్లాది మంది ప్రజలు రైల్లో ప్రయాణిస్తుంటారు. అప్పట్లో  బొగ్గుతో నడిచిన రైళ్లు ప్రజెంట్ డీజిల్, కరెంట్ తో పరుగులు పెడుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు లాభాల్లో ఉండాల్సిన రైల్వేను లాస్ లోకి నెడుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయాలపై ఫోకస్ చేస్తోంది రైల్వేశాఖ. ఆ ఆలోచనలో నుంచి వచ్చినవే సోలార్ రైళ్లు. అతి త్వరలో సోలార్ పవర్ తో నడిచే రైళ్లు మన ముందుకు రానున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ లో రైల్వేలో సోలార్ వినియోగంపై.. స్పెషల్ గా కాన్సట్రేట్ చేసింది రైల్వే శాఖ. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఓ నాన్ ఏసీ కోచ్ కు సోలార్ ప్యానెల్స్ ను అమర్చి.. పైలెట్ ప్రాజెక్టును సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన ఢిల్లీ రైల్వే శాఖ వీటిని పూర్తిస్థాయిలో నడిపించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. సోలార్ ట్రైన్లు పట్టాలెక్కితే డీజిల్, విద్యుత్ ఆదాతో పాటు వెదర్ పొల్యూషన్ ను కూడా తగ్గించవచ్చు.

సోలార్ పవర్ జనరేట్ కోసం రైలు పై భాగంలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. ప్యానెళ్లను అమర్చేందుకు 40 చదరపు మీటర్ల ప్లేస్ ఉంటుంది. అందులో 24 చదరపు మీటర్ల స్థలంలో 12 సోలార్ ప్యానెళ్లను ఫిట్ చేస్తారు. వీటితో రైలు నడిచేందుకు అవసరమైన కరెంట్ జనరేట్ అవుతుంది. సోలార్ తో నడిచే ట్రైన్ లు అందుబాటులోకి వస్తే రైల్వే శాఖకు డీజిల్ భారం భారీగా తగ్గనుంది. ఏటా 90 వేల లీటర్ల డీజిల్ ఆదా అవుతుందని అంచనా వేస్తోంది. అలాగే వీటివల్ల 200 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో కలువకుండా నివారించవచ్చు. ఈ సోలార్ స్కీమ్ కింద అన్ని నాన్ ఏసీ, ఏసీ కోచ్ లకు అవసరమైన కరెంట్ ను ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేస్తోంది భారత్ రైల్వేశాఖ. సోలార్ పవర్ తో పాటు సీఎన్ జీ, బయోడిజిల్ లాంటి ఇతర ఇంధనాల వాడకంపైనా ఫోకస్ చేసింది రైల్వే.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy