ఇచ్చిన హామీలు వందకు వంద శాతం అమలు : సీఎం కేసీఆర్

cm
ప్రజాసంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో పథకాలు చేపట్టామన్నారు సీఎం కేసీఆర్. పారదర్శకంగా ముందుకు సాగుతున్నామన్నారు. TRS ప్లీనరీలో మాట్లాడిన ఆయన…2014ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించామని చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను పునర్వ్యవస్థీకరించి, పాలనా సంస్కరణలలో భాగంగా 10 జిల్లాలను 31 జిల్లాలు చేసినానని చెప్పారు. ప్రజా సంక్షేమం… రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా పని చేస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు.

ప్రభుత్వం చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన భూ ప్రక్షాళన కార్యక్రమం ఒక ఉదహరణగా చెప్పారు సీఎం. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే దశాబ్దాలుగా  భూ ప్రక్షాళన కార్యక్రమం కొనసాగుతూనే ఉందని… ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. ఇదే కార్యక్రమం మా రాష్ట్రాలతో చేపడితే ప్రభుత్వం పడిపోతుందని పలు రాష్ట్రాల సీఎంలు స్వయంగా తనతో చెప్పారన్నారు. రికార్డు సమయంలో భూ ప్రక్షాళన పూర్తి చేసి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు మన ప్రభుత్వం సమాయత్తమైందన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందకు వంద శాతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ మన్నారు. అయితే వాస్తవాలను గమనించకుండా TPCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు  . టీపీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి టీ అన్న పదం  టీఆర్  కారణంగానే వచ్చిందని, తెలంగాణను సాధించిన పార్టీ TRS అని గుర్తుంచుకోవాలని అన్నారు. కర్నాటక మంత్రి స్వయంగా మీ పొరుగునే ఉన్నా 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం  తమ వల్ల కావడం లేదన్నారని సీఎం కేసీఆర్ చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy