ఇజ్రాయెల్ గడ్డపై.. ఐ లవ్ మోడీ.. ఐ లవ్ ఇండియన్స్

modi-mosheఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ.. 26/11 ఉగ్రదాడుల బాధితుడు.. 11 ఏళ్ల చిన్నారి మోషె ను కలుసుకున్నారు. మోషె తో సరదాగ ముచ్చటించారు. ఐ లవ్ మోడీ.. ఐ లవ్ ఇండియన్స్ అంటూ.. మోడీతో మోషె అన్నాడు. మోషె ను చూసి.. ప్రధాని మోడీ.. చాలా మురిసిపోయారు. ఇండియా మోషేకు ఎప్పుడైనా రావొచ్చు.. ఎప్పుడైనా వెళ్లొచ్చన్నారు మోడీ. ఈ సందర్భంగా మోషెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రధాని మోడీతో తమ ఆత్మీయతను పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య అనుబంధాలకు మోషె ప్రతీకగా నిలుస్తున్నారన్నారు స్థానిక భారతీయులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy