ఇట్స్ అఫీషియల్ : అభిమన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్

ABHIMANYUDUమహానటి సినిమాలో తన క్యారెక్టర్ తో అందరిని ఆకట్టుకున్న సమంత..మరో సినిమాతో ముందుకు వస్తున్నారు. విశాల్ హీరోగా ఆమె నటించిన సినిమా అభిమన్యుడు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది యూనిట్. జూన్ 1న అభిమన్యుడు రిలీజ్ చేయనున్నట్లు సోమవారం (మే-21) ట్విట్టర్ ద్వారా తెలిపాడు హీరో విశాల్. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. రంగస్థలం, మహానటి సినిమాల్లో మంచి క్యారెక్టర్ లో నటించిన సమంత ఈ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం కన్ఫామ్ అంటున్నారు. తమిళ్ డైరెక్టర్ మిత్రన్ తెరకెక్కించిన ఈ మూవీ ఆడియో మే-25న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది సినిమా యూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy